తన స్క్రిప్ట్ విషయంలో తుది నిర్ణయం ఎవరిదో చెప్తున్నాడు మహేష్

తన స్క్రిప్ట్ విషయంలో తుది నిర్ణయం ఎవరిదో చెప్తున్నాడు మహేష్
x
Highlights

సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లో 25వ సినిమా గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా విడుదల కానుంది. మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది....

సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లో 25వ సినిమా గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా విడుదల కానుంది. మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. సరిగ్గా నెలరోజుల ముందు మహేష్ మైనపు విగ్రహాన్ని (వాక్స్ స్టాట్యూ) సింగపూర్ మ్యాడమ్ టుస్సాడ్స్ నిర్వాహకులు ఏఎంబీ సినిమాస్ లో లాంచ్ చేశారు. అదే రోజు సాయంత్రం ఆ విగ్రహాన్ని హైదరాబాద్ నుండి తిరిగి సింగపూర్ కి తరలించారు. "నన్ను నేను చూసుకున్నట్టుంది!" అని సూపర్ స్టార్ కూడా చాలా సంతోషపడ్డాడు.

ఆ విగ్రహం గురించి మహేష్ ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. "నా కుటుంబ సభ్యులు కూడా విగ్రహాన్ని చూసి ఎంతో ఎగ్జయిట్ అయిపోయారు. సితార అయితే అస్సలు అది నమ్మలేకపోయింది. దగ్గరకు వెళ్లి టచ్ చేసి అప్పుడు అది విగ్రహమేనని నిర్ణయించుకుంది. మా అబ్బాయి (గౌతమ్) నమ్రత కూడా చాలా బావుంది అని సర్ప్రైజ్ అయ్యారు" అని మహేష్ తెలిపారు. ఇక సినిమాల స్క్రిప్టు ఎంపికల గురించి చెప్తూ, "ప్రతి సినిమాకి ఏదో ఒక వేరియేషన్ ని స్క్రిప్టులో కోరుకుంటాను. నా స్క్రిప్టుల్ని నాకు నేనే ఎంపిక చేసుకుంటాను. అందులో ఎవరి సాయం తీసుకోను. స్క్రిప్టు విన్నాక నాకు నేనే జడ్జ్ చేస్తాను. అదంతా ఓ ప్రాసెస్. ఆ ప్రాసెస్ లోకి వెళ్లడం గొప్ప జర్నీ" అని అన్నారు మహేష్.


Show Full Article
Print Article
Next Story
More Stories