Mahesh: ఫ్లాప్‌ టాక్ వచ్చిన సినిమా 200 రోజులు ఆడింది.. మహేష్‌ నటించిన సినిమా ఏంటంటే..?

Mahesh Babu Guntur Kaaram Movie Run 200 Days in Single Theater Even got Flop Talk
x

Mahesh: ఫ్లాప్‌ టాక్ వచ్చిన సినిమా 200 రోజులు ఆడింది.. మహేష్‌ నటించిన సినిమా ఏంటంటే..?

Highlights

Mahesh Babu: ప్రస్తుతం సినిమా విజయానికి అర్థం మారిపోయింది. ఒకప్పుడు 100 డేస్‌ ఆడితే సినిమా బ్లాక్‌ బ్లాస్టర్‌ హిట్‌ అనుకునే వాళ్లం.

Mahesh Babu: ప్రస్తుతం సినిమా విజయానికి అర్థం మారిపోయింది. ఒకప్పుడు 100 డేస్‌ ఆడితే సినిమా బ్లాక్‌ బ్లాస్టర్‌ హిట్‌ అనుకునే వాళ్లం. కానీ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌తో పాటు మరెన్నో వినోద సాధనాలు అందుబాటులోకి రావడంతో హిట్‌ సినిమా అర్థమే మారిపోయింది. ఇప్పుడు ఎంత తక్కువ సమయంలో ఎంత ఎక్కువ కలెక్షన్లను రాబట్టింది అనేదే ముఖ్యం. సినిమా విజయాన్ని కూడా కలెక్షన్ల పరంగానే అంచనా వేస్తున్నారు.

అయితే మహేష్‌ బాబు హీరోగా నటించిన ఓ సినిమా మాత్రం ఒక థియేటర్‌లో ఏకంగా 200 రోజులు ఆడింది. అలా అని ఆ సినిమా ఏదో సూపర్ హిట్‌ మూవీ అనుకుంటే పొరబడటినట్లే. నిజానికి ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ను దక్కించుకుంది. ఒక రకంగా చెప్పాలంటే మహేష్‌ స్థాయి మూవీ కాదంటూ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటనేగా.. అదే గుంటూరు కారం. అతడు, ఖలేజ తర్వాత త్రివిక్రమ్‌, మహేష్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో మాత్రం విజయాన్ని అందుకోలేకపోయింది. మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకొని రూ. 180 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టి బ్రేక్‌ ఈవెన్‌తో బయటపడింది. అయితే ఇది కేవలం మహేష్‌ బాబు ఇమేజ్‌ వల్లే సాధ్యమైందని అప్పట్లో రివ్యూవర్స్‌ కూడా వ్యాఖ్యానించారు. అయితే ఇలా ఫ్లాప్‌ టాక్‌ను సొంతం చేసుకున్న గుంటూరు కారం మూవీగుంటూరు జిల్లా చిలకలూరిపేటలో అనూహ్యంగా 200 రోజులు ప్రదర్శితమైంది. ఏకంగా రోజు నాలుగు ఆటలతో 200 రోజులు ఆడడం విశేషం.

ఇదిలా ఉంటే ప్రస్తుత మహేష్‌, రాజమౌళితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లానింగ్‌ చేస్తున్నారు. కాగా త్రివిక్రమ్‌ గుంటూరు కారం తర్వాత తన తదుపరి చిత్రాన్ని ఇంత వరకు ప్రకటించలేదు. అయితే తాజా సమాచారం మేరకు అల్లు అర్జున్‌తో ఓ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. పుష్ప2 పూర్తికాగానే ఈ సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు సమచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories