SSMB 29 Launched: మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ ప్రారంభం.. ఇంతకీ ప్రిన్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Mahesh Babu and SS Rajamoulis Film SSMB29 Launched
x

SSMB 29 Launched: మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ ప్రారంభం.. ఇంతకీ ప్రిన్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Highlights

SSMB 29 Launched: మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న అత్యంత భారీ ప్రాజెక్ట్ ప్రారంభమైంది.

SSMB 29 Launched: మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న అత్యంత భారీ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. గురువారం హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో అధికారికంగా SSMB29 చిత్రాన్ని లాంచ్ చేశారు. చిత్ర యూనిట్‌తో పాటు మహేష్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు సమాచారం. మహేష్ బాబుకు తను ఏదైనా సినిమా ఓపెనింగ్‌కు వస్తే అది ఫెయిల్ అవుతుందనే బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. కానీ రాజమౌళితో చేస్తోన్న సినిమా కోసం స్వయంగా హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళి.. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని ఈ చిత్రంలో రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ చిత్రానికి కథను అందించింది కూడా ఆయనే. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ రెండు భాగాలుగా రానుంది. తొలి భాగాన్ని 2027లో విడుదల చేస్తారని ప్రచారంలో ఉంది. ఈ ప్రాజెక్టులో హాలీవుడ్ నటీనటులతో పాటు టెక్నీషియన్స్ కూడా ఇందులో భాగం కానున్నారు. కథతో పాటు స్క్రీన్‌ప్లే, అన్ని భాషలకు సంబంధించి డైలాగ్స్ వెర్షన్స్ పూర్తయ్యాయి.

రాజమౌళి సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో మహేష్ బాబు నటన ప్రేక్షకులను ఫిదా చేయడం పక్కా అని చెబుతున్నారు. ఈ సినిమా కోసం మహేష్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్టు టాక్. ఈ సినిమా షూటింగ్ కోసం రాజమౌళి ఇప్పటికే పలు లొకేషన్స్‌ను సెర్చ్ చేసిన విషయం తెలిసిందే. ఒడిశాతో పాటు ఆఫ్రికా వంటి అడవుల్లో ఆయన పర్యటించారు. దుర్గా ఆర్ట్స్ పై కె.ఎల్ నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించనున్నట్టు ఒక వార్త బాగా వైరల్ అయింది. తాజాగా జాన్వీకపూర్ పేరు వినిపించడం గమనార్హం. ఇక ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించారు. మొదటి భాగం 2027లో, రెండో భాగం 2029లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా కోసం మహేష్ పూర్గిగా మూడు సంవత్సరాలు కేటాయించనున్నారు.

అయితే ఇప్పుడు అందరి దృష్టి మహేష్ రెమ్యునరేషన్‌పై పడింది. ఇంత భారీ ప్రాజెక్టుకు మహేష్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో అంటూ టాక్ నడుస్తోంది. అయితే సాధారణంగా మహేష్ బాబు రెమ్యునరేషన్ రూ.250 కోట్లకు పైగా ఉంటుందని సినీ ఇండస్ట్రీ టాక్. అయితే ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతోంది. మహేష్ బాబు, రాజమౌళి ఇద్దరు లాభాల్లో చెరో 25% వాటా తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ భారీ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories