Mahendragiri Varahi: సంక్రాంతి బరిలో సుమంత్ మహేంద్రగిరి వారాహి

Mahendragiri Varahi: సంక్రాంతి బరిలో సుమంత్ మహేంద్రగిరి వారాహి
x
Highlights

Mahendragiri Varahi: వారాహి రాజశ్యామల బ్యానర్‌పై తెరకెక్కుతున్న ప్రొడక్షన్‌ నెంబరు - 2 చిత్రం మహేంద్రగిరి వారాహి.

Mahendragiri Varahi: వారాహి రాజశ్యామల బ్యానర్‌పై తెరకెక్కుతున్న ప్రొడక్షన్‌ నెంబరు - 2 చిత్రం మహేంద్రగిరి వారాహి. ఈ చిత్ర గ్లిమ్స్ ను ఇటీవల ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేశారు అలాగే గ్రిమ్స్ ఆసక్తికరంగా ఉందని తన ట్విట్టర్ ఖాతాలో టాలెంటెడ్ యాక్టర్ విశ్వక్ సేన్ పోస్ట్ చేశారు, గ్లిమ్స్ కు విశేష స్పందన లభించింది.

మహేంద్రగిరి వారాహి సినిమాలో విలక్షణ నటుడు బ్రహ్మానందం నటిస్తున్నట్లు చిత్ర దర్శకుడు సంతోష్ జాగర్లపూడి, నిర్మాత కాలిపు మధు ఇటీవల వెల్లడించారు. మహేంద్రగిరి వారాహి స్క్రిప్ట్ అద్భుతంగా నచ్చి బ్రహ్మానందం ఈ సినిమా చేయబోతున్నారని దర్శకులు సంతోష్ జాగర్లపూడి తెలిపారు.

మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కధాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర నిర్మాత కాలిపు మధు తెలిపారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

వచ్చే ఏడాది... 2025 సంక్రాంతికి మహేంద్రగిరి వారాహి చిత్రాన్ని విడుదల చెయ్యడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories