Breaking News: సినీ గేయ రచయిత కందికొండ కన్నుమూత

Lyricist Kandikonda Yadagiri Passed Away
x

Breaking News: సినీ గేయ రచయిత కందికొండ కన్నుమూత

Highlights

Kandikonda: సినీ లిరిక్‌ రైటర్ కందికొండ యాదగిరి కన్నుమూశారు.

Kandikonda: సినీ లిరిక్‌ రైటర్ కందికొండ యాదగిరి కన్నుమూశారు. కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న కందికొండ హఠాత్తుగా చనిపోయారు. కందికొండ వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లి గ్రామంలో జన్మించారు.

మొదట్లో జానపద గీతాలు రాసిన కందికొండకు సినీ సంగీత దర్శకుడైన చక్రితో సాన్నిహిత్యం ఏర్పడింది. అలా ఆయన సినిమా సాహిత్యం వైపు అడుగులు వేశాడు. తొలిసారిగా చక్రి సంగీత దర్శకత్వం వహించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంలో మళ్లి కూయవే గువ్వా పాట రచనతో సినీ సాహిత్యంలో అడుగుపెట్టారు. ఆ పాట చాలా ప్రాచుర్యం పొందింది. సంగీత దర్శకుడు చక్రి, దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమాలకు పాటలు రాసి గేయరచయితగా నిలదొక్కుకున్నాడు. ఆంధ్రావాలా, అల్లరి పిడుగు, ఆప్తుడు, ఒక రాధ ఇద్దరి కృష్ణుల పెళ్ళి, చక్రం ఇలా ఎన్నో సినిమాల్లో అద్భుతమైన లిరిక్స్ అందించారు.

కందికొండ సినీరంగంలో అడుగుపెట్టిన నాటి నుండి పన్నెండేళ్ళ సినీ ప్రస్థానంలో వేయికి పైగా పాటలు రాశారు. అంతేకాకుండా తెలంగాణ నేపథ్యంలో ఎన్నో జానపద గీతాలు కూడా రచించారు. కందికొండ రాసిన బతుకమ్మ పాటలు జనాల గుండెల్లో నాటుకపోయాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories