Love Story: సెప్టెంబర్ 10న థియేటర్ లలో విడుదల కానున్న "లవ్ స్టోరి"

Love Story Movie Releasing Theaters on 10 September
x

లవ్ స్టోరీ పోస్టర్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Love Story: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా "లవ్ స్టోరి"

Love Story: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా "లవ్ స్టోరి". ఈ సినిమా సెప్టెంబర్ 10న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్ లలో విడుదలవుతున్న ప్రెస్టీజియస్ మూవీ "లవ్ స్టోరి" కావడం విశేషం. రేవంత్, మౌనికల ప్రేమ కథను తెరపై చూసేందుకు ఆడియెన్స్ చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. సెప్టెంబర్ 10న "లవ్ స్టోరి" థియేటర్ రిలీజ్ కు రావడం అటు ఎగ్జిబిషన్ సెక్టార్ లోనూ ఉత్సాహం నింపబోతోంది.

"లవ్ స్టోరి" సినిమాలో పాటలు అనూహ్య ఆదరణ పొందాయి. యూట్యూబ్ వ్యూస్ లో 'సారంగదరియా' ఆల్ టైమ్ రికార్డులు తిరగరాసింది. 'హే పిల్లా', 'నీ చిత్రం చూసి..' పాటలు కూడా మ్యూజిక్ లవర్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించాయి. "లవ్ స్టోరి" మ్యూజికల్ గా హిట్ అవడం సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచాయి. దర్శకుడు శేఖర్ కమ్ముల చూపించబోయే ప్లెజంట్, ఎమోషనల్ ప్రేమ కథకు ఈ పాటలు అదనపు ఆకర్షణ కానున్నాయి.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ''లవ్ స్టోరి'' చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటించారు.

సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, మ్యూజిక్ : పవన్ సి.హెచ్, సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి, పిఆర్ఓ : జి.ఎస్.కె. మీడియా , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర రావు, నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు, రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.

Show Full Article
Print Article
Next Story
More Stories