Love Story Movie: లవ్ స్టోరీ డైలాగులపై కన్నెర్ర చేస్తున్న నెటిజన్లు

Love Story Movie in Controversy Due to Naga Chaitanya Dialogues | Love Story Update
x

వివాదాల్లో చిక్కుకున్న నాగచైతన్య "లవ్ స్టోరీ" (ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

* ఈ కాంట్రవర్సి వల్ల సినిమా మళ్ళీ వాయిదా పడుతుందేమోనని అభిమానులు భయపడుతున్నారు

Love Story Movie Dialogues: అక్కినేని నాగచైతన్య తన ఆశలన్నీ తన తదుపరి సినిమా "లవ్ స్టోరీ" పైన పెట్టుకున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాలో డైలాగులు చాలా బాగున్నాయి అని ట్రైలర్ చూస్తేనే అది తెలుస్తుందని అభిమానులు సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆ డైలాగులే సినిమాని పెద్ద కాంట్రవర్సీ లో చుట్టుకునేలా చేశాయి. నాగచైతన్య ఒక అధికారి తో మాట్లాడుతూ "గొర్రెలు కాసుకునే వాడికి గొర్రెలు ఇస్తే గొర్రెలే కాస్కుంటాడు ఇంకేం డెవలప్ అయితాం సర్" అని అంటాడు.

దీంతో కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయని సినిమా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గొర్రెలు కాసుకునే వాడికి గొర్రెలను ఇవ్వకూడదు కానీ సినిమాలు తీసే వాడే సినిమాలు ఇవ్వచా అంటూ సినిమాపై కన్నెర్ర చేస్తున్నారు. తక్షణమే ఈ సినిమాని ఆపేయాలి అంటూ ధర్నాకు దిగుతున్నారు. ఇప్పటికే చాలాసార్లు వాయిదాలు పడి ఎట్టకేలకు సెప్టెంబర్ 24న విడుదల కాబోతోంది ఈ సినిమా. ఈ కాంట్రవర్సి వల్ల సినిమా మళ్ళీ వాయిదా పడుతుందేమోనని అభిమానులు భయపడుతున్నారు. ఈ వివాదంపై ఈ చిత్ర బృందం ఇంకా స్పందించాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories