సినీ ఇండస్ట్రీలో ప్రేమలు.. మోసాలు.. కేసులు..

Love Deception and Cases Here is All About Film Industry
x

సినీ ఇండస్ట్రీలో ప్రేమలు.. మోసాలు.. కేసులు..

Highlights

Film Industry: హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ అంటే ఇప్పుడు తెలియనివారెవరూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో....?

హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ అంటే ఇప్పుడు తెలియనివారెవరూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో....? సినీ ఇండస్ట్రీలో వరుసగా ప్రేమించి మోసాలు జరిగాయంటూ ఇప్పటికే నార్సింగి పోలీస్ స్టేషన్‌కు మూడు కేసులొచ్చాయి.. ప్రేమించుకోవడం.. ఆ తర్వాత లివింగ్ రిలేషన్‌లో ఉండడం.. ఇతరేతర కార్యక్రమాల్లోను పాల్గొనడం.. ఆ తర్వాత చిన్నపాటి గొడవలు పడడం.. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయడం సర్వసాధారణంగా మారింది. తాజాగా ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై నార్సింగి పోలీసులకు ఓ బాధిత యువతి ఫిర్యాదు చేసింది.

ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై నార్సింగి పోలీసు స్టేషన్లో అత్యాచార కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేశాడని, నగ్నచిత్రాలు సేకరించి బ్లాయిమెయిల్ చేశాడని సినీ నటి ఇచ్చిన ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. నగ్న వీడియోలు సేకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, పెద్దమొత్తంలో డబ్బు తీసుకున్నాడని ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. బాధిత యువతి ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు 328, 376 (2) 354, 376 N కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే బాధిత యువతి స్టేట్‌మెంటును రికార్డు చేశారు నార్సింగి పోలీసులు... కేసు నమోదు అయినప్పటి నుంచి నిందితుడు యూట్యూబర్ హర్షసాయి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అప్పటి నుంచి హర్షసాయి తండ్రి రాధాకృష్ణ అందుబాటులో లేకుండా పోయారు. తండ్రి రాధాకృష్ణ, కొడుకు హర్షసాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టరు.

సినిమాల్లో అవకాశాల కోసం ముంబయికి చెందిన యువతి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చింది. ఒక సినిమాలోనూ నటించింది. గతంలో ఒక రియాల్టీ షోలో పాల్గొంది. ఓ ప్రైవేటు పార్టీలో హర్షసాయి తనను కలిశాడని, అప్పటి నుంచి ఇద్దరి స్నేహం మొదలైందని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. యువతిని వైద్యపరీక్షల నిమిత్తం కొండాపూర్‌లోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షలు కూడా నిర్వహించారు. కొన్ని శాంపిళ్లను ల్యాబ్‌కు పంపించారు పోలీసులు.

ఏపీలోని విశాఖకు చెందిన హర్షసాయి యూట్యూబ్‌లో వీడియోలు చేస్తుంటాడు. అతని ఛానెల్‌ను మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. పేదలకు డబ్బులు ఎద జల్లుతూ, డబ్బులు ఇస్తూ అనేక వీడియోలు తన ఛానెల్లో అప్‌లోడ్ చేస్తుంటాడు. హర్షసాయి హీరోగా... బాధిత యువతి హీరోయిన్‌గా గతంలో ఒక సినిమాను ప్రారంభించారు. అయితే ఇటీవలే హర్షసాయి.. బాధిత యువతి మధ్య వాట్సాప్ కాల్‌లో జరిగిన సంభాషణకు సంబంధించి లీక్ అయిన ఆడియో సంచలనం సృష్టించింది.

తాజాగా ఆమె ఆరోపణలను ఉద్దేశించి యూట్యూబర్ హర్షసాయి స్పందించారు. ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ పెట్టారు. అవన్నీ తప్పుడు ఆరోపణలని తేల్చి చెప్పారు. డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. తన గురించి అందరకీ తెలుసని పేర్కొన్నారు. త్వరలోనే నిజం బయటకు వస్తుంది ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తన తరఫు న్యాయవాది చూసుకుంటారని వెల్లడించారు. ప్రేమ పేరుతో మోసం చేశారని యువతి ఫిర్యాదుతో యూట్యూబర్‌ హర్షసాయిపై అత్యాచారం కేసును నార్సింగి పోలీసులు నమోదు చేశారు. యువతిపై అత్యాచారం చేశాడని, నగ్నచిత్రాలు సేకరించి బ్లాక్‌మెయిల్‌ చేశాడని యువతి ఫిర్యాదులోనూ పేర్కొంది. అయితే యువతి వద్ద పెద్దమొత్తంలో హర్షసాయి డబ్బు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

అయితే హర్షసాయిపై వస్తున్న ఆరోపణలని తప్పుడువని, డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారన్నారు హర్షసాయి.... ప్రజలకు నా గురించి తెలుసని, త్వరలోనే నిజం బయటకు వస్తుందని, ఈ విషయాన్ని తన తరఫు న్యాయవాది చూసుకుంటారని హర్షసాయి తెలిపారు. ఇటీవలే యూట్యూబర్ హర్షసాయి మెగా అనే మూవీలో హీరోగా నటించారు. 2023లో టీజర్ రిలీజ్ అయినా ఇప్పటివరకు సినిమా రిలీజ్​ ఎప్పుడో ప్రకటించలేదు.

తాజాగా హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదు కావడంతో తన అభిమానులతోపాటు పలువురు యూట్యూబర్లు సైతం షాక్‌కు గురయ్యారు. మొత్తానికి ప్రేమ పేరుతో మోసం చేశాడని యువతి ఫిర్యాదుతో నమోదైన కేసు ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాల్సిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories