TV Serials: కరోనా ఎఫెక్ట్.. సీరియల్స్ మళ్లీ ఆగిపోతాయా?

Lock Down Impact on TV Serials due to Corona
x

టీవీ సీరియల్స్ (ఫైల్ ఇమేజ్)

Highlights

TV Serials: ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి.

TV Serials: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. రోజురోజుకు కరోనా కేసలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. కరోనా దెబ్బకి అన్ని రంగాలు అతలాకుతలం అయిపోతున్నాయి. మరోసారి ఈ మహమ్మరి దెబ్బ టెలివిజన్ ఇండస్ట్రీపై పడింది.

టీవీలో వచ్చే సీరియల్స్‌కి షూటింగ్ ప్రతిరోజు చేయవలసి ఉంటుంది. టెలివిజన్ కంటెంట్ అనేది రోజూ ప్రసారం చేయాల్సి వస్తుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా 'షాదీ ముబారక్' అనే సీరియల్ ను అయితే తాత్కాలికంగా నిలిపివేశారు. తారక్ మెహతా 'ఉల్టా చస్త్మా' అనే పాపులర్ షో కి మే మొదటి అర్ధభాగం వరకు ప్రసారం చేసేందుకు ఎపిసోడ్ లు ఉన్నాయి. అయితే ఆ తర్వాత వాటిని కొనసాగించే పరిస్థితి అయితే లేకుండా పోయింది.

సిరీయల్స్ కోసం నిరంతరాయంగా షూటింగ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ లాక్‌డౌన్ పరిమితుల వల్ల షూటింగ్ లొకేషన్స్ గోవా వంటి ప్రదేశాలకు మారుతున్నప్పటికీ ఎంతోమంది నిర్మాతలకి ఇది భారంగా మారింది. రాష్ట్రాలు దాటి ఇతర ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న సీరియల్స్ లో కొన్ని హమారీ వాలీ గుడ్ న్యూస్, కుండలి భాగ్య, కుంకుమ బాగ్యా, ఖుర్బాన్ హువా వంటి సీరియల్ లు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ కార్యాచరణలో భాగంగా తక్కువ రేటింగ్ వస్తున్న షోలు అన్నింటిని నిలిపివేసే ఆలోచనలో ఉన్నారు.

ఇండియన్ ఫిలిం అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చైర్మన్ జెడి మజేథియా మాట్లాడుతూ.. కానీ లాక్ డౌన్ కొనసాగితే సిరీయల్స్, షోలు కొనసాగే అవకాశం లేదు. కొన్ని షోలను పూర్తిగా నిలిపివేసే యోచనలో వారు ఉన్నట్లు కన్ ఫర్మ్ చేశారు. లాక్ డౌన్ నిబంధనలు మే రెండో తారీకు వరకు ఉన్నాయి. కాబట్టి ముంబై లో షూటింగ్ కనుక ఆ తర్వాత కొనసాగితే ఎక్కువ షోలు ఆగిపోయే పరిస్థితి లేదు.

మరోవైపు తెలుగు సిరీయల్స్ , షోల విషయానికి వస్తే.. ప్రస్తుతం సేఫ్ గా నడుస్తున్న తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు వీటిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. హైదరాబాద్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఇప్పటికే సినిమా థియేటర్లు మూతపడ్గాయి. హీరోలు కూడా తమ షూటింగులకు బ్రేక్ చెప్పేశారు. సిరీయల్స్ చిత్రీకరణ స్టూడియోల్లో జరుగుతున్నాయి. ప్రతి సిరీయల్ షూటింగ్ ముందు కరోనా టెస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం సేఫ్ మోడ్ లో ఉన్నప్పటికీ మే 2తర్వాత లాక్ డౌన్ ఉటుందనే వార్తలు వస్తున్నాయి. తెలుగు సిరీయల్స్ భవిష్యత్తు కూడా 2 తర్వాత జరబోయే పరిణామాలపై ఆధారపడి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories