Upcoming Movies: ఈ వారం వినోదాల విందు.. థియేటర్లు, ఓటీటీల్లో ఇంట్రెస్టింగ్ మూవీస్‌..!

List of Movies and Web Series Releasing This Weekend in Telugu
x

Upcoming Movies: ఈ వారం వినోదాల విందు.. థియేటర్లు, ఓటీటీల్లో ఇంట్రెస్టింగ్ మూవీస్‌..!

Highlights

Upcoming Movies: ప్రతీ వీకెండ్‌లాగే ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించేందుకు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధమవుతున్నాయి.

Upcoming Movies: ప్రతీ వీకెండ్‌లాగే ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించేందుకు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధమవుతున్నాయి. ఈ వారంతం తెలుగుతో పాటు పలు భాషల్లో ఇంట్రెస్టింగ్ మూవీస్‌ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమవుతున్నాయి. మరి ఈ వారాంతం ఓటీటీల్లో, థియేటర్లో సందడి చేయడానికి వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

* పోస్టర్ విడుదల చేసే వరకు కూడా ఈ సినిమా ఒకటి వస్తుందనే విషయం తెలియలేదు. అదే 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ'.. నిఖిల్‌ హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్‌ 8వ తేదీన ప్రేక్షకుల ముందకు రానుంది. ‘స్వామిరారా’, ‘కేశవ’ వంటి హిట్‌ మూవీస్‌ వచ్చి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుండడంతో అంచనాలు ఉన్నాయి.

* హెబ్బా పటేల్‌, చేతన్ కృష్ణ జంటగా తెరకెక్కిన 'ధూం ధాం' చిత్రం కూడా ఈ వారం ప్రేక్షకులను పలకరిచేందుకు సిద్ధమవుతోంది. సాయి కిశోర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నవంబర్‌ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

* 1980లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మూవీ 'జితేందర్‌రెడ్డి'. ఈ సినిమాకు ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్‌ విరించి వ‌ర్మ దర్శకత్వం వహించాడు. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమాను నవంబర్‌ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

* ఈ వారం ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘బ్లడీ బెగ్గర్‌’. తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని నవంబర్‌ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కవిన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి శివ బాలన్ ముత్తుకుమార్‌ దర్శకత్వం వహించారు.

ఓటీటీలో సందడి చేయనున్న ప్రాజెక్ట్స్‌..

అమెజాన్‌ ప్రైమ్‌..

ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సిటాడెల్‌ సిటాడెల్‌: హనీ బన్నీ (హిందీ సిరీస్‌) నవంబరు 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో సమంత లీడ్‌ రోల్‌లో నటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు కౌంట్‌డౌన్‌: పాల్‌ వర్సెస్‌ టైసన్‌వెబ్‌సిరీస్‌ నవంబరు 7, ఇన్వెస్టిగేషన్‌ ఏలియన్‌ (వెబ్‌సిరీస్‌)నవంబరు 8 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.

* జియో సినిమా వేదికగా డిస్పికబుల్‌ మీ 4 (తెలుగు) నవంబరు 5 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

* డిస్నీ+హాట్‌స్టార్‌లో ఎక్స్‌ప్లోరర్‌ : ఎండ్యూరన్స్‌ (హలీవుడ్‌) నవంబరు 3 నుంచి, అజయంతే రందం మోషనమ్‌ (ARM) (మలయాళం) నవంబరు 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

* నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం ఎక్కువ సినిమాలు విడుదల కానున్నాయి. మీట్‌ మీ నెక్ట్స్‌ క్రిస్మస్‌ (హలీవుడ్‌) నవంబరు 6 నుంచి, అవుటర్‌ బ్యాంక్స్‌ 4 (వెబ్‌సిరీస్‌) నవంబరు 7 నుంచి, మిస్టర్‌ ప్లాంక్‌టన్‌ (కొరియన్‌) నవంబరు 8, ది బకింగ్‌ హామ్‌ మర్డర్స్‌ (హిందీ) నవంబరు 8, ఉమ్జోలో (హాలీవుడ్‌) నవంబరు 8, వేట్టయాన్‌ (తెలుగు) నవంబరు 8, విజయ్‌ 69 (హిందీ) నవంబరు 8, ఆర్కేన్‌ 2 (యానిమేషన్‌) నవంబరు 9, ఇట్స్‌ఎండ్‌ విత్‌ అజ్‌ (హాలీవుడ్‌) నవంబరు 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానున్నాయి.

* ఇక తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో జనక అయితే గనక (తెలుగు) నవంబరు 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

* బుక్‌ మై షోలో ట్రాన్స్‌ఫార్మర్స్‌ వన్‌ (యానిమేషన్‌)నవంబరు 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories