వైరల్ అవుతున్న బాలు చివరి లేఖ!

వైరల్ అవుతున్న బాలు చివరి లేఖ!
x

SP Balasubrahmanyam Last Latter

Highlights

SP Balasubrahmanyam Last Latter : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. దాదాపుగా అయిదు దశాబ్దాల పాటు సంగీత ప్రపంచాన్ని తన అద్భుతమైన గొంతుతో అలరించారు.. జనరేషన్ మారిన కొద్ది అయన కూడా మారుతూ కథానాయకుల గొంతుకు తగట్టుగా పాటలు పాడుతుండేవారు

SP Balasubrahmanyam Last Latter : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. దాదాపుగా అయిదు దశాబ్దాల పాటు సంగీత ప్రపంచాన్ని తన అద్భుతమైన గొంతుతో అలరించారు.. జనరేషన్ మారిన కొద్ది అయన కూడా మారుతూ కథానాయకుల గొంతుకు తగట్టుగా పాటలు పాడుతుండేవారు. అందుకే బాలు పాట ఎప్పటికి ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది.. ఏడుపదుల వయసులో కూడా ఎంతో యాక్టివ్ అయన తన గాత్రంతో ఆకట్టుకున్నారు. ఆ పాట అంటే ఆయనే పాడాలి.. అయన పాడితేనే ఆ పాటకి ఓ అందం వస్తుంది.. అసలు ఆ పాట ఆయన కోసమే పుట్టిందా అన్నట్టుగా అనిపించేది.. . అలా ఒక భాష నుంచి ఒక పాట నుంచి దాదాపుగా 16 భాషల్లో 40వేలకి పైగా పాటలు పాడి చాలా మంది అభిమానులని సొంతం చేసుకున్నారు.

వాస్తవానికి 40వేలకి పైగా పాటలు పాడడం అనేది మాములు విషయం కాదు.. ఆ పాటలకి గాను ఎన్నో అవార్డులు, ఎన్నో ప్రశంసలు అందుకున్నారు బాలు.. అయన సినీ పరిశ్రమకి అందించిన సేవలకి గాను భారత ప్రభుత్వం నుండి 2001 లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011 లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందజేసింది.. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 29 సార్లు వివిధ విభాగాల్లో అయన నంది పురస్కారం అందుకున్నారు బాలు.. అటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు. ఇక అయన అభిమానులు గర్వంగా గానగంధర్వుడు అని పిలుచుకుంటారు.

అయితే బాలు ఎన్నడూ తన బిరుదులను బయటకు చెప్పుకునేందుకు ఇష్టపడరు.. తనను ఎవరైనా ఏదైనా కార్యక్రమానికి పిలిచినా, తన పేరు ముందు ఎటువంటి విశ్లేషణలూ వేయవద్దని ముందే స్పష్టం చేసేవారు.. అలా అయన చివరగా రాసిన ఓ లేఖ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. "సన్మానితులు శ్రీ ప్రకాశ్ గారికి, నమస్సులు. విజయదశమి శుభాకాంక్షలు. నవంబర్ 30న మీ కార్యక్రమంలో తప్పక పాల్గొనగలను. కొన్ని చిన్ని చిన్ని అభ్యర్థనలను మీరు మన్నించక తప్పదు. దయచేసి నా పేరు ముందు డాక్టర్, పద్మభూషణ్, గాన గంధర్వ లాంటి విశ్లేషణలు వేయకండి. మనకు ఇంకా వ్యవధి ఉంది కాబట్టి, ప్రయాణ వివరాలు తరువాత తెలుపగలను. కృతజ్ఞతలతో శ్రీ.పం. బాలసుబ్రహ్మణ్యం" అని అందులో రాశారు బాలు..





Show Full Article
Print Article
Next Story
More Stories