Prabhas: ప్రభాస్‌-రాఘవపూడి సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌.. సరికొత్త పాత్రలో డార్లింగ్‌

Latest buzz about prabhas and hanu raghavapudi movie story line
x

Prabhas: ప్రభాస్‌-రాఘవపూడి సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌.. సరికొత్త పాత్రలో డార్లింగ్‌ 

Highlights

సీతారామం చిత్రాన్ని యుద్ధం, ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కించిన హను రాఘవపూడి ప్రభాస్‌ సినిమాకు కూడా ఇదే కథాంశంతో తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

Prabhas: ప్రస్తుతం ప్రభాస్‌ రేంజ్‌ మారిపోయింది. బాహుబలితో మొదలైన ప్రభాస్‌ మేనియా, కల్కితో పీక్స్‌కి చేరింది. ప్రభాస్‌ నుంచి కొత్త సినిమా వస్తుందంటే చాలు రికార్డులు తిరగరాయడం ఖాయమని స్పష్టమవుతోంది. కల్కితో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రభాస్‌ తదుపరి చిత్రం ఏంటన్న దానిపై ప్రస్తుతం సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటికే ప్రభాస్‌ చేతిలో ‘సలార్‌ 2’, ‘కల్కి' సీక్వెల్‌తో పాటు సందీప్‌ వంగా దర్శకత్వంలో స్పిరిట్‌, మారుతి దర్శకతవ్ంలో రాజాసాబ్‌ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీటితో పాటు ప్రభాస్‌ మరో చిత్రానికి సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. సీతారామమ్‌తో సంచలన విజయం అందుకున్న హనురాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్‌ నటించనున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ వచ్చింది.

సీతారామం చిత్రాన్ని యుద్ధం, ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కించిన హను రాఘవపూడి ప్రభాస్‌ సినిమాకు కూడా ఇదే కథాంశంతో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా యుద్ధం, ప్రేమతో రానుందని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. సీతారామమ్‌లో కూడా హీరో సోల్జర్‌ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్‌ పనులు శరవేగగంగా జరుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో చిత్ర యూనిట్ ప్రకటించనుంది.

ఇదిలా ఉంటే తాజాగా కల్కి విజయంపై ప్రభాస్‌ స్పందించారు. కల్కి చిత్రాన్ని ఆదరించిన అభిమానులకు, తోటి నటులకు కృతజ్ఞతలు ప్రభాస్‌ తెలిపారు. ఇందులో భాగంగా ఓ వీడియోను రూపొందించారు. ఈ వీడియో ప్రభాస్‌ మాట్లాడుతూ.. 'అభిమానులు లేకపోతే నేను జీరో. ఇంత భారీ విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతలు. అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్‌ల నుంచి ఎంతో నేర్చుకున్నా. రెండో భాగం మరింత భారీగా ఉండనుంది' అని చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories