Laggam: అక్టోబర్ 25న రానున్న 'లగ్గం' సినిమా.. ఆల్ ది బెస్ట్ చెప్పిన సుధీర్ బాబు

Laggam: అక్టోబర్ 25న రానున్న లగ్గం సినిమా.. ఆల్ ది బెస్ట్ చెప్పిన సుధీర్ బాబు
x

అక్టోబర్ 25న రానున్న 'లగ్గం' సినిమా.. ఆల్ ది బెస్ట్ చెప్పిన సుధీర్ బాబు

Highlights

Laggam: సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం.

Laggam: సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, నేడు లగ్గం సినిమా "రిలీజ్ డేట్ లాంచింగ్ పోస్టర్" లాంఛ్ చేశారు. ప్రముఖ హీరో సుధీర్ బాబు చేతుల మీదుగా ఈ పోస్టర్ లాంఛ్ చేశారు. టీజర్ చూసిన సుధీర్ బాబు చాలా బాగుందని ప్రశంసించి, టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. ఈ సినిమాలో నటీనటులు పూర్తి తెలంగాణ యాస మాట్లాడకుండా వాడుక భాషలో మాట్లాడుతారు. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది. ఇది లగ్గం నామ సంవత్సరం కాబోతుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేశాడు.

ఇటీవల విడుదలైన టీజర్‌కు, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లగ్గం సినిమా అక్టోబర్ 25న వరల్డ్ వైడ్ ఏషియన్ సురేష్ ద్వారా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

"కుటుంబమంతా కలిసి చూడాల్సిన సినిమా లగ్గం" అని నటకిరీటి రాజేంద్రప్రసాద్ తెలిపారు.

"ప్రతి ప్రవాస భారతీయులు తప్పకుండా చూడల్సిన సినిమా. ప్రతి ఆడపిల్ల తండ్రి కూతురికి పెళ్లి చేసేముందు ఈ సినిమా చూడాలి" అని ఎల్బీ శ్రీరాం తెలిపారు. "ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తప్పకుండా చూడాల్సిన చిత్రం" అని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.

ఈ సినిమాలో సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్బి శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చంద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం తదితరులు నటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories