Laggam: తెలంగాణ పెళ్లి కల్చర్‌కు అద్దం పట్టే 'లగ్గం'.. అక్టోబర్ 18న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం..!

Laggam: తెలంగాణ పెళ్లి కల్చర్‌కు అద్దం పట్టే లగ్గం.. అక్టోబర్ 18న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం..!
x
Highlights

Laggam: సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు.

Laggam: సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలంగాణ నేపథ్యంలో సాగే తెలుగు సినిమా. రెండు రాష్ట్రాల వాళ్ళు ఈ చిత్రం చూసి గొప్పగా మాట్లాడుకుంటారని సినిమా యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇటీవల విడుదలైన ఈ సినిమా సాంగ్స్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లగ్గం సినిమా అక్టోబర్ 18న వరల్డ్ వైడ్ థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

చక్కటి కథ, కథనాలు, వినసొంపైన సంగీతం, మనుషుల భావోద్వేగాలు, కుటుంబ విలువలు లగ్గం సినిమాలో ఉన్నాయని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. "ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమాగా లగ్గం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని" నటకిరీటి రాజేంద్రప్రసాద్ తెలిపారు.

కాగా, ఈ సినిమాలో సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్బి శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చంద్ర, చిత్రం శ్రీను తదితరులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories