Nayanthara: తన సక్సెస్ సీక్రెట్ వెల్లడించిన లేడీ సూపర్ స్టార్

Nayanthara: తన సక్సెస్ సీక్రెట్ వెల్లడించిన లేడీ సూపర్ స్టార్
x
Highlights

Nayanthara: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ గా ఉన్న నయనతార యాక్టింగ్ తో పాటు, నిర్మాతగా, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. నయనతార గతేడాది ఫేమీ 9 శానిటరీ...

Nayanthara: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ గా ఉన్న నయనతార యాక్టింగ్ తో పాటు, నిర్మాతగా, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. నయనతార గతేడాది ఫేమీ 9 శానిటరీ నాప్కిన్ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మదురైలో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నయనతార పంపిణీ దారులు, ఏజెంట్లకు కొన్ని సూచనలు, సలహాలు చేశారు. అమ్మకాలను పెంచడంలో కీలకపాత్ర పోషించిన వారిని అభినందిస్తూ వారికి బహుమతులు కూడా అందజేశారు.

ఈ సందర్భంగా నయనతార తన సక్సెస్ సీక్రెట్ ను చెప్పుకొచ్చారు. ఎప్పుడు వదులుకోకూడని రెండు విషయాల గురించి ఆమె మాట్లాడారు. ఆమె మాటలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నా జీవితంలో నేనెప్పుడూ నమ్మే రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఆత్మవిశ్వాసం. రెండవది ఆత్మగౌరవం. ఇవి ఉంటే ఎవరు మనల్ని విమర్శించలేరు అన్నారు నయనతార.

మనలో ఆత్మవిశ్వాసం పెరగాలంటే.. మనం నిజాయితీగా కష్టపడాలి. ఎవరేం చెప్పినా.. ఎంత నీచంగా మాట్లాడిన.. తప్పుగా ప్రవర్తించినా.. వాటన్నింటినీ పట్టించుకోకుండా నిజాయితీగా కృషి చేయాలి. అప్పుడే ఒకరిలో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది అని నయనతార చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో నయనతార తో పాటు ఆమె ఎవరు భర్త విగ్నేష్ శివన్ కూడా పాల్గొన్నారు. నయనతార నిర్వహిస్తున్న ఫేమీ 9 శానిటరీ నాప్కిన్ సంస్థలో ఎక్కువమంది మహిళలు పనిచేస్తున్నారు. వారిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే నయనతార ఇలా మాట్లాడారని తెలుస్తోంది. ఈ ఏడాది దాదాపు 8 సినిమాల్లో నటిస్తున్నారు ఈ లేడీస్ సూపర్ స్టార్.

అయితే ఈ ఏడాది నయనతార నటించిన కనీసం ఐదు సినిమాలైనా రిలీజ్ అవుతాయని చెబుతున్నారు. కాబట్టి ఈ ఏడాది నాయనతారది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా నయనతార నటించిన 'టెస్ట్', 'మన్నాంగట్టి' మూవీస్ షూటింగ్ పూర్తయింది. కాబట్టి ఈ సినిమాల విడుదల తేదీలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories