Oscars 2025: 2025 ఆస్కార్‌కు 'లాపతా లేడీస్'..

Oscars 2025: 2025 ఆస్కార్‌కు లాపతా లేడీస్..
x

Oscars 2025: 2025 ఆస్కార్‌కు 'లాపతా లేడీస్'..

Highlights

Laapataa Ladies: లాపతా లేడీస్ సినిమాను ఆస్కార్ 2025 పోటీలకు ఇండియా నుంచి ఎంపికైంది. బాలీవుడ్ నటులు అమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు ఈ సినిమాకు...

Laapataa Ladies: లాపతా లేడీస్ సినిమాను ఆస్కార్ 2025 పోటీలకు ఇండియా నుంచి ఎంపికైంది. బాలీవుడ్ నటులు అమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది.

2001 సంవత్సరంలో గ్రామీణ ప్రాంతానికి చెందిన నవ వధువులు రైలు ప్రయాణంలో తారుమారైన ఘటన లాపతా టేడీస్ గా తెరకెక్కించారు. ఈ సినిమాను అమిర్ ఖాన్ నిర్మించారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో గత ఏడాది ఈ సినిమాను ప్రదర్శించారు.

కిరణ్ రావు చెప్పినట్టుగానే....

ఈ సినిమా ఆస్కార్ 2025కు ఎంపికవుతుందని ఆ సినిమా దర్శకురాలు కిరణ్ రావు చెప్పారు. ఈ సినిమా ఆస్కార్ వేదికపై ఇండియాకు ప్రాతినిథ్యం వహించాలనేది తమ టీమ్ కోరికగా చెప్పారు. గత ఏడాది మలయాళం సినిమా 2018ను అధికారిక ఎంట్రీగా పంపించినా అది 96వ అకాడమీ అవార్డుల షార్ట్ లిస్ట్ కు ఎంపిక కాలేదు.అంతకుముందు ఏడాది ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ కేటగిరిలో అవార్డు దక్కింది. దీంతో పాటు ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే డాక్యుమెంటరీకి ఆస్కార్ దక్కింది. 2001లో ఇండియా నుంచి ఎంపికైన ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో లగాన్ నిలిచింది. అయితే అప్పట్లో ఈ సినిమాను వెనక్కి నెట్టి నో మ్యాన్స్ ల్యాండ్ అనే మూవీ అవార్డు దక్కించుకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories