Samantha: కూకట్‌పల్లి కోర్టు కీలక ఆదేశాలు

Kukatpally Court Give Final Judgment in Samantha Defamation Case
x

Samantha: కూకట్‌పల్లి కోర్టు కీలక ఆదేశాలు

Highlights

Samantha: నటి సమంతకు కూకట్ పల్లి కోర్టు తీర్పు ఊరట నిచ్చింది.

Samantha: నటి సమంతకు కూకట్ పల్లి కోర్టు తీర్పు ఊరట నిచ్చింది. ఆమెపై సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు, వ్యక్తులు చేసిన వ్యాఖ్యలను, ప్రసారం చేసిన కంటెంట్ ను తక్షణం తొలగించాలని కోర్ట్ ఇంజంక్షన్ ఆర్డర్స్ పాస్ చేసింది. సమంత కూడా తన వ్యక్తిగత వివరాలు సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని కోర్ట్ సూచించింది. సమంత విడాకుల విషయమై సోషల్ మీడియాలో విపరీత వ్యాఖ్యానాలు వచ్చిన నేపధ్యంలో ఆమె కోర్టును ఆశ్రయించారు.

తన వ్యక్తిగత ప్రతిష్టను, ప్రైవసీని దెబ్బతీసారని తక్షణం వాటిపై పర్మనెంట్ ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వాలనీ కోరారు. కేసును ఎమర్జెన్సీ కింద ట్రీట్ చేసి విచారించాలన్న సమంత విన్నపాన్ని కోర్టు తోసి పుచ్చింది. కోర్ట్ ముందు అందరూ సమానమేనని, సెలబ్రిటీలైనంత మాత్రాన పిటిషన్ కు అత్యవసర విచారణార్హత ఉండదనీ తేల్చి చెప్పింది. మూడు రోజుల పాటు వాదోపవాదాలు విన్నతర్వాత ఇవాళ సమంతకు ఊరటనిచ్చే తీర్పును వెలువరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories