ఆ పాత్రలకి మోహన్ బాబు,వెంకటేష్ అని అనుకున్నాను కానీ...

ఆ పాత్రలకి మోహన్ బాబు,వెంకటేష్ అని అనుకున్నాను కానీ...
x
Highlights

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు. కానీ క్రియేటివ్ డైరెక్టర్స్ మాత్రం కొందరే ఉన్నారు. అందులో కృష్ణవంశీ ఒకరు. అయన దర్శకత్వంలో...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు. కానీ క్రియేటివ్ డైరెక్టర్స్ మాత్రం కొందరే ఉన్నారు. అందులో కృష్ణవంశీ ఒకరు. అయన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం గోవిందుడు అందరివాడేలే.. 2014 లో ఈ సినిమా విడుదలైంది. అనుకున్నా విజయం సాధించకపోయినప్పటికీ పర్వాలేదు అనిపించింది ఈ సినిమా. అయితే ఈ సినిమాలోని ప్రకాష్ రాజ్ మరియు శ్రీకాంత్ పాత్రలకి ముందుగా మోహన్ బాబు, వెంకటేష్ అని అనుకున్నారట కృష్ణవంశీ

కానీ మోహన్ బాబు ఒప్పుకుంటారో లేదో అని సత్యరాజ్ ని కలిశారట కృష్ణవంశీ .. కానీ అయన ఆ తాత పాత్ర చేయడానికి ఒప్పుకోలేదు కానీ శ్రీకాంత్ పాత్ర చేయడానికి మొగ్గు చూపారట.! కానీ ఆ పాత్రకి సత్యరాజ్ చాలా పెద్దవాడిలా కనబడతాడని వద్దు అనుకున్నాడట కృష్ణవంశీ.. ఆ తరవాత చాలామందినే సంప్రదించాడట కృష్ణవంశీ .... కానీ చివరికి ఆ పాత్ర ప్రకాష్ రాజ్ చేస్తే బాగుంటుందని చిరంజీవి సూచిచడంతో ఆ పాత్రకి ప్రకాష్ రాజ్ తీసుకున్నారు. అంతకుముందు ఈ పాత్రను తమిళ నటుడు రాజ్ కిరణ్ తో షూట్ చేసారు. కానీ అనుకున్నా ఫీల్ రావడం లేదని మళ్ళీ ప్రకాష్ రాజ్ తో రీ షూట్ చేసారు కృష్ణవంశీ

ఇక ముందుగా శ్రీకాంత్ పాత్రను వెంకటేష్ తో చేయించాలని అనుకున్నారట కృష్ణవంశీ .. కానీ అప్పటికే వెంకటేష్, ప్రకాష్ రాజ్ తండ్రి కొడుకులుగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కనిపించడంతో శ్రీకాంత్ ని తీసుకున్నారట.. ఈ విషయాలని కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories