NTR 30పై కీలక అప్‌డేట్.. మొత్తానికి..

Koratala Will Focus Only On NTR Film
x

ఎన్టీఆర్ సినిమాపై మాత్రమే దృష్టి పెట్టనున్న కొరటాల

Highlights

* ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీ కాబోతున్న కొరటాల

Koratala Siva: చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ వరుసగా శ్రీమంతుడు, మిర్చి, జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా "ఆచార్య" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు కానీ ఆ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తన ఆశలన్నీ తన తదుపరి సినిమా పైన పెట్టుకున్నారు కొరటాల.

ఎన్టీఆర్30 సినిమాతో కొరటాల మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ సినిమా బిజినెస్ యాంగిల్ లో డిస్ట్రిబ్యూషన్ నిర్ణయాలు సేల్స్ ప్లాన్స్ మరియు ఆచార్య డిస్ట్రిబ్యూటర్ల కు చేయాల్సిన భర్తీలు వీటి వల్ల కొరటాల శివ ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పై ఫోకస్ చేయలేకపోయారు. అయితే తాజా సమాచారం ప్రకారం కొరటాల శివ ఇప్పుడు ఈ పనులు అన్నిటినీ పక్కన పెట్టేసి ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ మీదనే వర్క్ చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

చిత్ర నిర్మాత మిక్కిలినేని సుధాకర్ తనకి మంచి స్నేహితుడు అయినప్పటికీ సినిమా సీన్స్ బాధ్యతలన్నీ కొరటాల వేరొకరికి అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పటినుంచి కొరటాల శివ కేవలం సినిమా మీద మాత్రమే దృష్టి పెట్టనున్నారట. "ఆచార్య" సినిమాతో డిజాస్టర్ అందుకున్న కొరటాల ఎన్టీఆర్ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్క్రిప్ట్ పైన వర్క్ చేయాలని కొరటాల నిర్ణయించుకున్నారు. ఇక వచ్చేనెల ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories