బరువు తగ్గనున్న చిరంజీవి

బరువు తగ్గనున్న చిరంజీవి
x
Highlights

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సైరా' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సైరా' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తరువాత చిరు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి ఒక సరి కొత్త లుక్ లో కనిపించనున్నారట. అయితే ఆ పాత్ర కోసం చిరు బరువు తగ్గాల్సి ఉంది. ఒక వయసు వచ్చాక ఆ బరువు తగ్గటం పెరగటం అనేది చాలా కష్టమైన విషయం అని తెలిసిందే.

కానీ 63 ఏళ్ల వయస్సులో కూడా చిరంజీవి కేవలం సినిమా కోసం తన బరువును తగ్గించాలని ప్రయత్నాలు మొదలు పెట్టనున్నారు. నిజానికి పాలిటిక్స్ లో కొన్నాళ్ళు రాజకీయాల్లో బిజీగా ఉండి 'ఖైదీ నంబర్ 150' సినిమాతో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ముందు చిరు కొంత బరువు తగ్గిన విషయం తెలిసిందే. కానీ కొరటాల శివ సినిమా కోసం మరింత బరువు తగ్గాల్సిన తగ్గాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. 'సైరా' సినిమాలో పాత్రకు తగ్గట్టుగా గాంభీర్యంగా కనిపించే చిరు ఈ సినిమాలో కొత్త లుక్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మాటినీ ఎంటర్టైన్మెంట్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories