Suriya: ప్రభాస్‌తో మల్టీస్టారర్‌.. సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు..!

Kollywood Star Hero Suriya Interesting Comments About Tollywood Heroes
x

Suriya: ప్రభాస్‌తో మల్టీస్టారర్‌.. సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు..!

Highlights

Suriya: కోలీవుడ్ స్టార్‌ హీరో సూర్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు.

Suriya: కోలీవుడ్ స్టార్‌ హీరో సూర్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. సూర్య నుంచి కొత్త మూవీ వస్తుందంటే చాలు తెలుగులోనూ భారీ స్థాయిలో విడుదల అవుతుంది. సూర్యకు తెలుగులో మంచి మార్కెట్ ఉండడమే దీనికి కారణంగా చెప్పొచ్చు. కాగా సూర్య ప్రస్తుత కంగువా మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నారు.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. దర్శకుడు శివ ఈ చిత్రాన్ని ఫాంటసీ యాక్షన్‌ ఫిలిమ్‌గా తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులోనూ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచిన చిత్ర యూనిట్‌ వైజాగ్‌లో మెగా ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో సూర్య, బాబీ దేవోల్‌, దేవిశ్రీ ప్రసాద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు హీరోల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గ్లోబల్ స్టార్‌ రామ్‌ చరణ్‌ గురించి సూర్య మాట్లాడుతూ.. గ్లోబల్‌ స్టార్‌ చరణ్‌ తనకు సోదరుడితో సమానమని అన్నారు. చెర్రీతో తనకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయని, తన సినిమాలు చూసి ఫోన్‌ చేసి ప్రశంసిస్తారని సూర్య గుర్తు చేసుకున్నారు. రామ్‌ చరణ్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలనుందని మనసులో మాటను బయట పెట్టారు. ఇక ప్రభాస్‌ గురించి మాట్లాడుతూ.. ప్రభాస్‌తో మల్టీస్టారర్‌ చేస్తే ఫుల్‌ యాక్షన్‌ మూవీ చేస్తానని చెప్పుకొచ్చారు.

ఇక సూపర్ స్టార్ మహేష్‌ బాబు గురించి చెప్పుకొస్తూ.. 'స్కూల్లో మహేశ్‌ నాకు జూనియర్‌. ఆయన స్క్రీన్‌ ప్రెజెన్స్‌ బాగుంటుంది. ఎమోషన్స్‌ బాగా చూపిస్తారు'అని ప్రశసంలు కురిపించారు. ఇక ఎన్టీఆర్‌ విషయానికొస్తే.. ఆయన తెలుగు మాట్లాడే విధానం ఆకట్టుకుంటుందని, చాలా స్పష్టంగా మాట్లాడతారని చెప్పుకొచ్చారు. ఇక తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి అల్లు అరవింద్‌ కూడా ఓ కారణని సూర్య తెలిపారు. ‘గజిని’ సినిమాను ఆయన డిస్ట్రిబ్యూట్‌ చేశారని, అల్లు అర్జున్‌ చాలా కష్టపడతారన్నారు. . ‘పుష్ప2’ కోసం వేచి చూస్తున్నాని సూర్య చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories