"వేర్టిగో" వ్యాధితో బాధపడుతున్న జెస్సీ.. ఆ వ్యాధి లక్షణాలు ఇవే..!!

Bigg Boss Telugu 5 Jessie Goes to Secret Room as he Suffering From Vertigo | Know About Vertigo Symptoms
x

"వేర్టిగో" వ్యాధితో బాధపడుతున్న జెస్సీ.. ఆ వ్యాధి లక్షణాలు ఇవే..!!

Highlights

Bigg Boss Telugu 5 Jessie - Vertigo Symptoms: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు కంటెస్టంట్ జెస్సీ గత కొన్ని రోజులుగా "వేర్టిగో" అని వ్యాధితో బాధపడుతున్న సంగతి...

Bigg Boss Telugu 5 Jessie - Vertigo Symptoms: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు కంటెస్టంట్ జెస్సీ గత కొన్ని రోజులుగా "వేర్టిగో" అని వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యాధికి ట్రీట్ మెంట్ ఇచ్చిన జెస్సీ కోలుకోకపోవడంతో బిగ్ బాస్ ఇంటి నుండి బయటికి పంపి ఒక సీక్రెట్ రూమ్ లో ఉంచడం చూశాము. అయితే ఆ సీక్రెట్ రూమ్ లో జెస్సీకి ట్రీట్ మెంట్ ఇచ్చి బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతారా లేదా ఆరోగ్యం కోలుకోకపోతే అటు నుండి అటే ఇంటికి పంపుతారా ఈ వారం గడిస్తే గాని చెప్పలేము.. అయితే జెస్సీ బాధపడుతున్న "వేర్టిగో" వ్యాధి గురించి తెలుసుకుందాం..

వేర్టిగో అనే పదం లాటిన్ భాష లోని "వెర్తో" నుండి వచ్చినది. మనం ఒక దగ్గర కూర్చున్న కదులుతున్నాం అనే భ్రమలో ఉన్నట్టు అనిపించడం. దీనినే కళ్ళు తిరగడం, తల తిరగడం అంటూ ఉంటాం. వినికిడి శక్తి మందగించడం, వాంతి వస్తుందనే ఫీలింగ్ తో పాటు వికారంగా ఉండటం ఈ వ్యాధి లక్షణాలు. తలను కదిలించినపుడు ఇలాంటి లక్షణాలు ఆ వ్యక్తికి కనిపిస్తాయి. వేర్టిగో రెండు రకాలు ఒకటి సెంట్రల్‌ వేర్టిగో, రెండు పెరిఫరల్‌ వేర్టిగో. 30-40% మందికి వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా ఇలా కళ్ళు తిరగడం జరుగుతుంది. అయితే ఈ వ్యాధి అన్ని రకాల వయసుల వారికి వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఏడాది లెక్కల ప్రకారం 15% జనాభా కళ్ళు తిరగడం, 5% జనాభా వేర్టిగో అని భావిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories