సిరివెన్నెల మృతికి కారణాలు ఇవే: కిమ్స్‌ ఎండీ భాస్కరరావు

KIMS MD Bhaskar Rao Reveals About Sirivennela Seetarama Sasthry Death
x

సిరివెన్నెల మృతికి కారణాలు ఇవే: కిమ్స్‌ ఎండీ భాస్కరరావు

Highlights

KIMS: ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపై కిమ్స్‌ వైద్యులు ప్రకటన విడుదల చేశారు.

KIMS: ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపై కిమ్స్‌ వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ సంబంధిత సమస్యలతో మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు తుదిశ్వాస విడిచారని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు కిమ్స్‌ ఆస్పత్రి ఎండీ భాస్కరరావు మీడియాతో మాట్లాడుతూ.. 'ఆరేళ్ల క్రితం సిరివెన్నెలకు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారినపడడంతో సగం ఊపిరితిత్తిని తియాల్సి వచ్చింది. ఆ తర్వాత బైపాస్‌ సర్జరీ కూడా జరిగింది. వారం క్రితం మరో వైపు ఊపిరితిత్తుకి క్యాన్సర్‌ వస్తే దాంట్లో కూడా సగం తీసేశారు. ఆ తర్వాత రెండ్రోజులు బాగానే ఉన్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో అడ్వాన్స్‌డ్‌ ట్రీట్‌మెంట్‌ కోసం కిమ్స్‌కు తీసుకొచ్చారు.

కిమ్స్‌లో రెండ్రోజులు వైద్యం అందిస్తే బాగానే రికవరీ అయ్యారు. ప్రికాస్టమీ కూడా చేశాం. 45 శాతం ఊపిరితిత్తు తీసేశాం కాబట్టీ.. మిగిలిన 55 శాతం లంగ్‌కు ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది. ఆక్సినేషన్‌ సరిగా లేక ఎక్మో మిషన్‌పై పెట్టాం. గత ఐదు రోజుల నుంచి ఎక్మో మిషన్‌పైనే ఉన్నారు. ఎక్మో మిషన్‌పై ఉన్న తర్వాత క్యాన్సర్‌, పోస్ట్‌ బైపాస్‌ సర్జరీ, ఒబీస్‌ పేషెంట్‌ కావడం, కిడ్నీ డ్యామేజ్‌ అవడంతో ఇన్‌ఫెక్షన్‌ శరీరమంతా సోకింది. దీంతో మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు సిరివెన్నెల తుదిశ్వాస విడిచారు'' అని కిమ్స్‌ ఆసుపత్రి ఎండీ భాస్కరరావు మీడియాకు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories