Loveyapa Trailer: లవ్‌యాపా మూవీ వేడుకలో ఖుషీకపూర్.. తల్లిని గుర్తుచేసుకుని ఎమోషనల్

Khushi Kapoor gets emotional remembering mother Sridevi at Loveyapa trailer launch
x

Loveyapa Trailer: లవ్‌యాపా మూవీ వేడుకలో ఖుషీకపూర్.. తల్లిని గుర్తుచేసుకుని ఎమోషనల్

Highlights

Loveyapa Trailer: దివంగత నటి శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు.

Loveyapa Trailer: దివంగత నటి శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు. ఇప్పటికే పెద్ద కూతురు జాన్వీకపూర్ పలు సినిమాల్లో నటిస్తున్నారు. రీసెంట్‌గా దేవర మూవీతో హిట్ అందుకున్నారు. ఈ కమ్రంలో శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ కూడా వరుస అవకాశాలతో బిజీ అవుతున్నారు. 'ది ఆర్చిస్'తో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఖుషీ.. 'లవ్‌యాపా'తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం శుక్రవారం ముంబయిలో జరిగింది. ఇందులో పాల్గొన్న ఖుషీ కపూర్ తన తల్లిని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయినట్టు సమాచారం.

ఈ వేడుకలో పాల్గొన్న ఖుషీ కపూర్‌ను.. ఒకవేళ శ్రీదేవి ఈ కార్యక్రమంలో పాల్గొని ఉంటే ఏ విధంగా ఫీలయ్యేవారని ఓ విలేకరి ప్రశ్నించగా.. దానికి ఆమె నేను చాలా ఫీలవుతా. ఇప్పుడు అమ్మ గురించి ఏమీ మాట్లాడుకోవాలనుకోవడంలేదు అని బదులిచ్చినట్టు తెలుస్తోంది. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ ఖాన్.. శ్రీదేవిపై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ చిత్రంలో ఖుషీని చూస్తుంటే తనకు శ్రీదేవి గుర్తుకు వచ్చిందని తెలిపారు.

ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం లవ్ టుడే. ఈ మూవీ తమిళంలో మాత్రమే కాదు, తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా యూత్‌ను ఆకట్టుకుంది. దీంతో బాలీవుడ్ కన్ను ఈ మూవీపై పడింది. ఈ చిత్రానికి రీమేక్‌‌గా లవ్ యాపా తెరకెక్కుతోంది.

తాజాగా మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్రూషా కపూర్, అశుతోష్ రాణా, తన్వికా పార్లికర్, కికు శారదా, దేవిషి మందన్, ఆదిత్య కులశ్రేష్ట్, నిఖిల్ మోహతా, జాసన్ థామ్, యూసుస్ ఖాన్, యుక్తం ఖోల్సా, కుంజ్ ఆనంద్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. అద్వైత్ చందన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories