Prashanth Neel: నా సమాధి నీలకంఠాపురంలోనే.. సొంత గ్రామానికి భారీ విరాళం ఇచ్చిన ప్రశాంత్ నీల్..

KGF Director Prashanth Neel Donates Rs 50 Lakhs To Eye Hospital in Andhra Pradesh
x

Prashanth Neel: నా సమాధి నీలకంఠాపురంలోనే.. సొంత గ్రామానికి భారీ విరాళం ఇచ్చిన ప్రశాంత్ నీల్.. 

Highlights

Prashanth Neel: కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ "కే జి ఎఫ్" సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

Prashanth Neel: కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ "కే జి ఎఫ్" సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ మధ్యనే విడుదలైన "కే జి ఎఫ్: చాప్టర్ 2" కూడా అన్ని భాషల్లోనూ బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ పేరు తెలియని సినీ అభిమానులు ఉండరేమో. తన తండ్రి 75వ జయంతిని పురస్కరించుకుని ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు నీల్. తన తండ్రి స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్‌ లోని సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురంలో ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి నిర్మాణానికి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం పాఠశాలలో సోమవారం జరిగిన 75వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన్ని సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తండ్రి జయంతి ఇదే రోజు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. 'సినిమాల్లో నేను ఎంత గొప్పవాడినైనా.. నా మరణం అనంతరం నీలకంఠాపురంలోని మా నాన్న సమాధి పక్కనే నా సమాధి ఉంటుంద'ని ప్రశాంత్‌ నీల్‌ భావోద్వేగంతో అన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories