Jani Master Case: జానీ మాస్టర్ బాధితురాలిపై నాలుగుసార్లు లైంగిక దాడి చేశాడు... రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు - చంచల్ గూడ జైలుకు జానీ

Key points in Jani Master remand report
x

Jani Master Case: జానీ మాస్టర్ బాధితురాలిపై నాలుగుసార్లు లైంగిక దాడి చేశాడు... రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు - చంచల్ గూడ జైలుకు జానీ

Highlights

Jani Master: జానిమాస్టర్ బాధితురాలినిపెళ్లి చేసుకున్నాడు

Jani Master Remand Report:దురుద్దేశ్యంతోనే బాధితురాలిని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ నియమించుకున్నారని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు చెప్పారు. 2019లో బాధితురాలికి జానీ మాస్టర్ పరిచయమయ్యారు.

గోవాలో ఆయనను అరెస్ట్ చేసి సెప్టెంబర్ 19 రాత్రి హైద్రాబాద్ కు తీసుకు వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం జానీ మాస్టర్ ను ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపర్చారు. మేజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలను పోలీసులు ప్రస్తావించారు.

ముంబై హోటల్ లో లైంగిక దాడి

షూటింగ్ కోసం బాధితురాలిని జానీ మాస్టర్ ముంబైకి తీసుకెళ్లారు. 2020 జనవరిలో ముంబై హోటల్ లో బాధితురాలిపై ఆయన లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు చెబితే సినీ ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరింపులకు దిగారని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు తెలిపారు.

వ్యానిటీ వ్యాన్ లొ కూడా లైంగిక వేధింపులు

వ్యానిటీ వ్యాన్ లో కూడా బాధితురాలిపై లైంగిక వేధింపులకు దిగాడని పోలీసులు చెబుతున్నారు. ఒకరోజున లైంగికవాంఛకు అడ్డుచెప్పినందుకుగాను జుట్టుపట్టుకుని అద్దంపై కొట్టారు.ఔట్ డోర్ షూటింగ్ లకు వెళ్లిన సమయంలో లైంగిక వేధింపులు ఉండేవి. మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని బెదిరింపులకు దిగారు. అయితే వీటన్నింటిని భరించలేక అతని వద్ద అసిస్టెంట్ గా బాధితురాలు మానేసింది. అయితే ఆ సమయంలో ఆమె ఇంటికి భార్యతో కలిసి జానీ మాస్టర్ వెళ్లి దాడికి దిగారని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు చెప్పారు.

లైంగిక వేధింపుల గురించి బాధితురాలు ఈ నెల 16న రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ కు కేసును బదిలీ చేశారు.ఈ కేసును నార్సింగి పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసు నమోదైన తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రత్యేక బృందాలు గోవాలో ఆయనను అరెస్ట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories