Keerthy Suresh: సమంత వల్లే నాకు ఛాన్స్.. కీర్తి సురేష్

Keerthy Suresh Reveals Samantha Ruth Prabhu Recommended Her For Baby John
x

Keerthy Suresh: సమంత వల్లే నాకు ఛాన్స్.. కీర్తి సురేష్

Highlights

Keerthy Suresh: నటి కీర్తి సురేష్, సమంతకు థాంక్స్ చెప్పారు. బేబీ జాన్ చిత్రంలో తనకు ఛాన్స్ రావడానికి సమంతనే కారణమని చెప్పుకొచ్చారు.

Keerthy Suresh: నటి కీర్తి సురేష్, సమంతకు థాంక్స్ చెప్పారు. బేబీ జాన్ చిత్రంలో తనకు ఛాన్స్ రావడానికి సమంతనే కారణమని చెప్పుకొచ్చారు. సమంత వల్లే తనకు ఈ సినిమాలో అవకాశం వచ్చిందని తెలుపుతూ కృతజ్ఞలు తెలియజేశారు. దక్షిణాది చిత్రాలలో సత్తా చాటిన కీర్తి సురేశ్.. బేబి జాన్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళ చిత్రం తెరి సినిమాకు రీమేక్‌గా బేబి జాన్ చిత్రాన్ని నిర్మించారు. దీన్ని తమిళ వెర్షన్‌లో హీరోయిన్‌గా సమంత నటించారు. బేబి జాన్ సినిమా హిందీలో రీమేక్ చేయాలని చిత్ర బృందం భావించగానే సమంత నా పేరు చెప్పారు.

తమిళంలో ఆమె పోషించిన పాత్ర హిందీలో నేను చేయడం ఆనందంగా ఉందన్నారు కీర్తి సురేష్. ఈ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వడం ఎప్పటికీ మర్చిపోలేని అనుమతి అన్నారు. ఈ విషయంలో సమంతకు కృతజ్ఞతలు. తెరిలో సమంత నటన నాకెంతో ఇష్టం. నిజాయితీగా చెప్పాలంటే ఈ రీమేక్‌ కోసం సమంత నా పేరు చెప్పగానే భయపడ్డాను. కానీ ఆమె ఎంతో మద్దతు ఇచ్చారు. చిత్ర బృందం నా పేరు వెల్లడించగానే నువ్వు తప్ప ఈ పాత్రను మరెవ్వరూ చేయలేరు అని తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టారని గుర్తు చేశారు. ఆ సందేశం తనలో నమ్మకాన్ని పెంచిందన్నారు కీర్తి. ఉత్సాహంగా షూటింగ్‌లో పాల్గొన్నానని.. ఆమె ఇచ్చిన ధైర్యంతోనే చిత్రీకరణ పూర్తి చేశానని చెప్పారు.

కీర్తి సురేశ్, సమంత మహానటి సినిమాలో కలిసి నటించారు. ఇందులో సమంత జర్నలిస్ట్‌గా కనిపించగా.. కీర్తి సావిత్రిగా ఆకట్టుకున్నారు. బేబి జాన్ విషయానికొస్తే.. కాలీస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో నటించగా వామికా గబ్బీ, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించారు.

ఇక కీర్తి సురేశ్ జీవితానికొస్తే.. ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన చిరకాల స్నేహితుడు ఆంటోనితో కలిసి ఏడడుగులు వేశారు. డిసెంబర్ 12న గోవా వేదికగా హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో వివాహం జరిగింది. కీర్తి సురేష్ పెళ్లికి పలువురు చిత్ర ప్రముఖులు హాజరయ్యారు. గత 15 ఏళ్లుగా ఆంటోనితో రిలేషన్‌లో ఉన్నా.. కీర్తి ఎప్పుడూ తన లవ్ మేటర్‌ను బయటపెట్టలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories