Keerthy Suresh: మా ప్రేమ విషయం వారికి మాత్రమే తెలుసు.. తన లవ్ స్టోరీ గురించి కీర్తి సురేష్

Keerthi Suresh Opens Up About Her Love Story and Marriage
x

Keerthy Suresh: మా ప్రేమ విషయం వారికి మాత్రమే తెలుసు.. తన లవ్ స్టోరీ గురించి కీర్తి సురేష్

Highlights

Keerthy Suresh Love Story: నటి కీర్తి సురేష్ ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే తాజాగా ఆంటోనీ తట్టిల్‌తో తన ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు కీర్తి.

Keerthy Suresh Love Story: నటి కీర్తి సురేష్ ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే తాజాగా ఆంటోనీ తట్టిల్‌తో తన ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు కీర్తి. డిసెంబర్‌ 12న కీర్తి సురేష్‌, ఆంటోనీ తట్టిల్‌ల పెళ్లి గోవాలో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం గ్రాండ్‌గా జరిగింది. తన ప్రేమ, పెళ్లి గురించి కీర్తి సురేష్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.

రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ తన లవ్ విషయాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాము ఇంటర్ నుంచి ప్రేమించుకుంటున్నామని.. ఆంటోనీ తన కంటే ఏడేళ్లు పెద్ద అని చెప్పారు. ఆరేళ్ల నుంచి ఖతార్‌లో వర్క్ చేస్తున్నాడు. అయితే ఓ రోజు తాను తన ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్తే.. అక్కడికి ఆంటోని వచ్చాడని.. కుటుంబంతో కలిసి ఉండేసరికి అతడిని కలవలేకపోయానన్నారు. కను సైగ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయానన్నారు. ధైర్యం ఉంటే నాకు ప్రపోజ్ చేయమని అప్పుడు చెప్పా. 2010లో ఆంటోని ఫస్ట్ టైం తనకు ప్రపోజ్ చేసినట్టు కీర్తి తెలిపారు.

2016 నుంచి తమ బంధం మరింత బలపడిందన్నారు. తనకు ప్రామిస్ రింగ్‌ను బహుమతిగా ఇచ్చాడని.. తాముపెళ్లి చేసుకునే వరకు దాన్ని తీయలేదని చెప్పారు. తన సినిమాల్లో కూడా ఆ రింగ్‌ ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే తమ లవ్ విషయం సామ్, విజయ్, అట్లీ, ప్రియదర్శన్, ఐశ్వర్య లక్ష్మిలకు మాత్రమే తెలుసునన్నారు. అదే విధంగా 2017లో ఫారెన్ టూర్ కూడా వెళ్లినట్టు చెప్పారు. ప్రస్తుతం కీర్తి సురేష్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

నేను లోకల్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక మహానటి సినిమాతో ఏకంగా స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిపోయింది. అలాగే నానితో కలిసి నటించిన దసరా సినిమాకు అవార్డులు కూడా వరించాయి.

కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే రీసెంట్‌గా ఆంటోని తట్టిల్‌తో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది కీర్తి సురేష్. తెలుగు, తమిళ చిత్రాల ద్వారా హీరోయిన్‌గా గుర్తింపు పొందిన కీర్తి సురేష్.. బాలీవుడ్‌లోకి బేబీ జాన్ మూవీతో అడుగుపెట్టింది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను అందుకుంది. తమిళ సినిమా తెరి మూవీని బేబీ జాన్ పేరుతో హిందీలో రీమేక్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories