మాజీ బాయ్ ఫ్రెండ్ తో పని చెయ్యను అంటున్న హీరోయిన్ ?

మాజీ బాయ్ ఫ్రెండ్ తో పని చెయ్యను అంటున్న హీరోయిన్ ?
x
Highlights

కెరీర్ మొదట్లో ఒకళ్ళని ప్రేమించటం కానీ తరువాత వేరొకరిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయిన చాలామంది బాలీవుడ్ హీరోయిన్ల ని మనం ఇప్పటికే చూసాం. కానీ వేరే...

కెరీర్ మొదట్లో ఒకళ్ళని ప్రేమించటం కానీ తరువాత వేరొకరిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయిన చాలామంది బాలీవుడ్ హీరోయిన్ల ని మనం ఇప్పటికే చూసాం. కానీ వేరే వారితో పెళ్లయినప్పటికీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో కొందరు మంచి స్నేహంగా ఉంటూనే ఉంటారు. ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోయిన హృతిక్ రోషన్-సుజానే నుంచి ప్రేమించి విడిపోయిన దీపికా-రణబీర్ వరకు చాలామంది సెలబ్రిటీలు ఎక్స్ లతో బాగానే ఉంటారు. కానీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ మాత్రం తన మాజీ బాయ్ ఫ్రెండ్ కి వీలైనంత దూరంగా ఉండాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఒక డాన్స్ షో వాళ్లు కరీనా కపూర్ ని హోస్ట్ చేయమని అడగడానికి సంప్రదించారట. ఈ షోలో షాహిద్ ఇప్పటికే ఒక హోస్ట్ గా ఎంపిక్కయ్యాడు. కానీ షాహిద్ కపూర్ ఉన్న షో కి తాను రానని చెప్పేసి వారిని రిజెక్ట్ చేసింది కరీనా అని బాలీవుడ్లో ఒక వార్త హల్చల్ చేస్తోంది. నిజానికి కరీనా కపూర్ ఎప్పుడో కెరీర్ మొదట్లో ప్రేమలో ఉన్నారు. కానీ ఇప్పుడు విడిపోయి ఇద్దరు వేరే వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నారు. అయినప్పటికీ వారి మధ్య మంచి బంధం లేదని తెలుస్తోంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే విడిపోయిన తర్వాత కూడా 'ఊడ్తా పంజాబ్' సినిమా లో షాహిద్తో కలిసి నటించిన కరీనా కపూర్ ఇప్పుడు డాన్స్ షో కి మాత్రం హోస్ట్ చేయను అని కరాకండి గా చెప్పేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories