Kannappa: వివాదంలో కన్నప్ప.. పార్వతి దేవి లుక్‌పై నెటిజన్ల ఆగ్రహం

Kannappa Movie in Controversy Over  Parvathi Devi Poster
x

Kannappa: వివాదంలో కన్నప్ప.. పార్వతి దేవి లుక్‌పై నెటిజన్ల ఆగ్రహం

Highlights

Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌‌గా భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న చిత్రం కన్నప్ప.

Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌‌గా భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న చిత్రం కన్నప్ప. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మంగా మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పలువురు సౌతిండియా సినీ పరిశ్రమకు చెందిన నటులు, బాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్నీ సినిమాపై భారీగా అంచనాలను పెంచుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాలో పార్వతి దేవి పాత్రలో కాజల్ లుక్ రిలీజ్ చేశారు. కాగా ఇది సరికొత్త వివాదానికి దారితీసింది.

ఇటీవల కన్నప్ప మేకర్స్ రిలీజ్ చేసిన పార్వతి దేవి పోస్టర్‌లో కాజల్ తెల్లటి పట్టు చీరలో హిమాలయ పర్వతాల్లో ఒక బండరాయిపై కూర్చున్నట్టు కనిపిస్తోంది. ఆమె వెనుక మహాకాళి అవతారం పొగమంచుతో డిజైన్ చేయబడింది. ఈ పోస్టర్ సోషల్ వీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు మండిపడుతున్నారు. ఈ పోస్టర్‌లో కాజల్‌‌కు బొట్టు లేదు. పార్వతి దేవిని మోడ్రన్ లుక్‌లో చూపిస్తున్నారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లుక్‌ని వెంటనే మార్చి, పోస్టర్‌ని డిలీట్ చేయాలని అనేక మంది సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మరోవైపు ఇటీవల మంచు ఫ్యామిలీ వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య గొడవ ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అదే విధంగా మోహన్ బాబు జల్‌పల్లి వద్ద రిపోర్ట‌ర్‌పై దాడికి పాల్పడడం రచ్చగా మారింది. ప్రస్తుతం మోహన్ బాబు మీద మూడు కేసులు నమోదయ్యాయి.

మరోవైపు జల్‌పల్లి దగ్గర మంచు విష్ణు సెక్యూరిటీ సిబ్బంది అడవి పందుల్ని వేటాడిన వీడియో కూడా వైరల్ కావడంతో అది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక ఇప్పుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీలో పార్వతి లుక్ వివాదానికి దారి తీసింది. అయితే దీనిపై కన్నప్ప టీమ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories