Shiva Rajkumar: క్యాన్సర్‌ని జయించిన కన్నడ స్టార్ హీరో..ఆ రూమర్స్ అన్నింటికీ చెక్

Shiva Rajkumar: క్యాన్సర్‌ని జయించిన కన్నడ స్టార్ హీరో..ఆ రూమర్స్ అన్నింటికీ చెక్
x
Highlights

Shiva Rajkumar: కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్.. తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. క్యాన్సర్ నుంచి తాను పూర్తిగా కోలుకున్నాను అంటూ స్వయంగా...

Shiva Rajkumar: కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్.. తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. క్యాన్సర్ నుంచి తాను పూర్తిగా కోలుకున్నాను అంటూ స్వయంగా ప్రకటించారు. ఈ విషయం గురించి చెప్తూనే తన గురించి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను శివరాజ్ కుమార్ ఖండించారు. ఈ మేరకు తన భార్యతో కలిసి ఓ వీడియో మెసేజ్ ను అభిమానులకు షేర్ చేశారు.

డిసెంబర్ 24న అమెరికాలోని మియామీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో శివరాజ్ కుమార్ కు బ్లాడర్ క్యాన్సర్ సర్జరీ జరిగింది. సర్జరీ విజయవంతమైందని తర్వాత రిపోర్ట్స్ అన్ని నెగిటివ్ వచ్చాయి అంటూ శివరాజ్ కుమార్ దంపతులు ప్రకటించారు. అభిమానుల ప్రార్ధన వల్ల రిపోర్ట్స్ అన్నీ నెగటివ్ వచ్చాయి. ఇప్పుడు మా ఆయన క్యాన్సర్ ఫ్రీ అంటూ శివరాజ్ కుమార్ వైఫ్ గీత చెప్పుకొచ్చారు.

తనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. నాకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగిందంటూ వార్తలు వస్తున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు. యూరినరీ బ్లెడర్ కి సంబంధించిన చిన్న సర్జరీ జరిగింది. అంతే ఈ విషయంలో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కొన్ని రోజులు రెస్టు తీసుకొని మార్చి నుండి షూటింగ్ కి హాజరవు కావచ్చని డాక్టర్ చెప్పారు. కాబట్టి ఇక మరింత జోష్ తో నేనే మళ్లీ సినిమాలు చేస్తాను, డ్యాన్స్, ఫైట్స్ చూసి మీరంతా ఆశ్చర్యపోవాలని తెలిపారు.


రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో శివన్న ఓ కేమియో చేసిన సంగతి తెలిసిందే. సినిమా మొత్తం ఓ కేమియో చూపించారు. శివరాజ్ కుమార్ ఈ చిత్రం తర్వాత తెలుగు, తమిళంలో కూడా శివరాజ్ కుమార్ మంచి క్రేజ్ పెరిగింది. అందుకే రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ఆర్సి 16 లో శివరాజ్ కుమార్ కి కీలకపాత్ర ఇచ్చారు. సినిమాలో ఈ పాత్రకి చాలా వెయిట్ ఉన్నట్లు సమాచారం.

అటు రజనీకాంత్ లోకేష్- కనగరాజు చేస్తున్న కూలి చిత్రంలో కూడా శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. ఈ మధ్యలో శివన్నకు అనారోగ్యం అని తెలిసిన తలైవా ఫ్యాన్స్ కూడా ఎంతో టెన్షన్ పడ్డారు. అలానే రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా తమ సినిమా ఎక్కడ డిలే అవుతుందంటూ కంగారు పడిపోయారు. కానీ అందరికీ తీయని వార్త చెప్పారు శివరాజ్ కుమార్. మార్చి నుంచి శివన్న తిరిగి షూటింగ్ సెట్లోకి అడుగుపెట్టబోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories