Kangana Ranaut Latest Tweet : కంగనా.. ఇప్పుడు ఓ సంచలనం. మామూలుగానే ఆమె సంచలనాల పుట్ట. ఎవరినీ లెక్కచేయదు. ఉన్నది
Kangana Ranaut Latest Tweet : కంగనా.. ఇప్పుడు ఓ సంచలనం. మామూలుగానే ఆమె సంచలనాల పుట్ట. ఎవరినీ లెక్కచేయదు. ఉన్నది ఉన్నట్టు కచ్చితంగా కుండ బద్దలు కొట్టేస్తుంది. ఇప్పుడు సుశాంత్ ఆత్మహత్య విషయంలో అదే చేసింది. బాలీవుడ్ చీకటి కొనాలని ఎకిపారేసింది. తేనెతుట్టెను కదిలిస్తే ఆగదుగా.. అది రాజకీయ దుమారం అయింది.. కంగనా పై మహారాష్ట్ర సర్కారు కత్తి కట్టింది..
సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో పలువురు నటులు పైన, రాజకీయ నాయకుల పైన కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంది కంగనా.. ఈ నేపధ్యంలో కంగనా రనౌత్, శివసేనల మధ్య పెద్ద వార్ నడిచింది అనే చెప్పాలి.. ఈ క్రమంలో ముంబైని మరో POKలాగా కనిపిస్తుంది అంటూ కంగనా సంచలన వాఖ్యలు చేసింది. దీనితో ఆమెకి బెదిరింపులు ఎదురయ్యాయని పలు ట్వీట్లు చేసింది. తనని ముంబై లోకి రానివ్వమని పలువురు బెదిరింపులు ఇచ్చారని వెల్లడించింది కంగనా..
అయితే దీనిని సవాల్ గా తీసుకున్న కంగనా.. సెప్టెంబర్ 9 వ తేదిన తానూ ముంబై వస్తున్నానని, అక్కడకి వచ్చాక ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యాక సమయాన్ని కూడా పోస్ట్ చేస్తానని ఎవరైనా వచ్చి తనను అడ్డుకుంటారో చూస్తానని ట్వీట్ చేసింది. తన భద్రతకోసం కేంద్రం సహాయం కోరగా కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి 'వై' లెవల్ సెక్యురిటీని కల్పించింది.
ఇక ఇది ఇలా ఉంటే ఆమె వెకేషన్ నుంచి వచ్చేసరికి మహారాష్ట్ర ప్రభుత్వం ముంబయి పాలీహిల్‌లోని కంగన కార్యాలయం అక్రమ కట్టడమని పేర్కొంటూ బీఎంసీ అధికారులు కూల్చివేత ప్రారంభించారు. దీనితో కంగనా మహారాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. మీ అహంకారం తొలిగిపోయే రోజు వస్తుంది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
తాజాగా కుల్చివేసిన భవనంలోనే ఆ శిథిలాల నుంచే పనిచేస్తానని కంగనా ట్వీట్ చేసింది. తిరిగి భవనాన్ని పునఃనిర్మించుకునే స్థోమత తనకి లేదని వెల్లడించింది. ఈ మేరకు KanganaVsUddhav అని పేర్కొంటూ ఓ ట్వీట్ ని చేసింది. . ప్రపంచంలో ఎన్నో శిఖరాలను అధిరోహించాలనుకునే ధైర్యవంతురాలైన స్త్రీ సంకల్పానికి చిహ్నంగా ఈ కార్యాలయం ఉంటుంది అంటూ ఆ ట్వీట్ లో పేర్కొంది కంగనా..
I had my office opening on 15th Jan, shortly after corona hit us, like most of us I haven't worked ever since, don't have money to renovate it, I will work from those ruins keep that office ravaged as a symbol of a woman's will that dared to rise in this world #KanganaVsUddhav https://t.co/98VnFANVsu
— Kangana Ranaut (@KanganaTeam) September 10, 2020
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire