Kangana Ranaut: ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టేలా మాట్లాడే కంగనా కన్నీటి పర్యంతమయ్యారు.
Kangana Ranaut: బాలీవుడ్ రెబల్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న కంగనా రనౌత్ ఎన్నో ఛాలెంజింగ్ పాత్రలు పోషించి తనకంటు ఒక సపరేట్ ఇమేజ్ అండ్ పాపులారిటీని సంపాదించుకుంది. ఏ విషయాన్నైనా ఇట్టే కుండ బద్దలు కొట్టేలా మాట్లాడటం కంగనాకు అలవాటు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం పై బాలీవుడ్‌తో పాటు మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన పార్టీపై ఓరేంజ్‌లో ఫైర్ అయిన సంగతి తెలిసిందే కదా. మహారాష్ట్ర ప్రభుత్వం ఆమె పై కక్ష్య కట్టి మరి ఆమె ఉంటున్న నివాసాన్ని కూల్చినా.. ఎక్కడ వెరవకుండా తనదైన శైలిలో దూసుకుపోతూనే ఉంది. అలాంటి పైర్ బ్రాండ్ కన్నీటి పర్యంతమైంది. ఆ విశేషాలను తెలుసుకుందాం.
కంగన 34వ జన్మదినం సందర్భంగా ఆమె నటించిన 'తలైవి' చిత్ర ట్రైలర్ తాజాగా విడుదల చేశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. విజయ్ దర్శకత్వం వహించిన ఈ బయోపిక్‌లో జయలలిత పాత్రను కంగన పోషించింది. ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని మొదటి నుంచి చెప్తూ వస్తున్న కంగన తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ వేడుకలో వేదికపై మాట్లాడుతూ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంది.
'ఈ సందర్భంగా నేను ఒకరికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఆయన నా ప్రతిభపై నాకు నమ్మకం కలిగేలా చేశారు. సాధారణంగా.. సినిమా సెట్లో ఒక హీరోతో ఉన్నంత చనువుగా ఒక నటితో ఎవరూ ఉండరు. కానీ.. నటీనటులతో ఎలా వ్యవహరించాలనే విషయాన్ని ఆయనను చూసి నేర్చుకున్నా' అని సినిమా డైరెక్టర్ విజయ్‌ను ఉద్దేశిస్తూ ఆమె చెప్పుకొచ్చింది. ఈక్రమంలో ఆమె భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. 'నేను ఎప్పుడూ ఏడవను. నన్ను ఏడిపించే హక్కు ఎవ్వరికీ ఇవ్వను. నేను చివరిగా ఏడ్చింది ఎప్పుడో కూడా గుర్తులేదు. కానీ.. ఈ రోజు నేను ఏడ్చాను. ఇప్పుడు మనసు తేలికగా ఉంది' అని ఆ తర్వాత చేసిన ట్వీట్‌లో కంగన పేర్కొంది. కాగా.. ఈ చిత్రం ఏప్రిల్ 23న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ప్రకాష్‌రాజ్, అరవిందస్వామి కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
శిక్షణ పొందిన థియేటర్ నటి. 2006 లో 'గ్యాంగ్‌స్టర్' చిత్రంతో వెండి తెరపై అడుగు పెట్టింది. కంగనా మంచి నటి మంచి కథక్ నర్తకి కూడా.. రాజేంద్ర చతుర్వేది ఆధ్వర్యంలో నటేశ్వర్ నృత్య కళా మందిరంలో నాలుగు సంవత్సరాలు కథక్ నృత్యాన్ని అభ్యసించింది. క్వీన్ సినిమాకు కంగనా సహా రచయితగా పనిచేసింది. ఈ సినిమా 2014 జాతీయ అవార్డు సొంతం చేసుకుంది.
22 సంవత్సరాల వయసులో ప్రతిష్టాత్మక జాతీయ చలన చిత్ర పురష్కారాన్ని గెలుచుకున్న అతి పిన్న వయస్కులైన నటీమణులలో ఒకరు కంగనా రనౌత్. 2008 లో రిలీజైన ఫ్యాషన్ మూవీలో పోషించిన పాత్రకు కంగనా ఉత్తమ సహాయ నటి విభాగంలో మొదటిసారిగా జాతీయ అవార్డును అందుకుంది. తర్వాత 2014 లో 'క్వీన్' సినిమాలో నటనకు ఉత్తమ నటి జాతీయ అవార్డు ను అందుకుంది. మళ్లీ 2015 లో 'తనూ వెడ్స్ మను రిటర్న్స్' లో నటనకు ఉత్తమ జాతీయ నటిగా అవార్డు ను అందుకుంది. మళ్ళీ మార్చి 22, 2021 న, కంగనా తన పుట్టినరోజుకు ఒక రోజు ముందు, 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ ' మరియు 'పంగా' చిత్రాలకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డును గెలుచుకుంది. భారత ప్రభుత్వం 2020 లో పద్మశ్రీతో సత్కరించించిన విషయం తెలిసిందే.
తమిళనాట అమ్మ గా పిలవబడే లెజెండరీ నటి, రాజకీయ నాయకురాలు జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా 'తలైవి' రూపొందుతోంది. పాన్ ఇండియన్ సినిమాగా తెరకకెక్కుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా గురించి గత కొన్ని నెలలుగా యావత్ దేశ సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానుల్లో అంచనాలు పెరిగేలా 'తలైవి' సినిమా నుంచి తాజాగా చిత్ర బృందం ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.
I call myself Babbar Sherni cause I never cry I never give anyone the privilege of making me cry, don't remember when I cried last but today I cried and cried and cried and it feels so good #ThalaiviTrailer https://t.co/lfdXR321O0
— Kangana Ranaut (@KanganaTeam) March 23, 2021
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire