Kamal Haasan: నన్ను అలా పిలవొద్దు.. కమల్ హాసన్ ట్వీట్ వైరల్

Kamal Haasan: నన్ను అలా పిలవొద్దు.. కమల్ హాసన్ ట్వీట్ వైరల్
x
Highlights

Kamal Haasan drops Ulaganayakan title: భారతీయ సినిమా చరిత్ర ఉన్నంతకాలం గర్వించదగ్గ కళాకారుడు కమల్ హాసన్. సినీ రంగంలో అనేక ప్రయోగాలతో రచయితగా,...

Kamal Haasan drops Ulaganayakan title: భారతీయ సినిమా చరిత్ర ఉన్నంతకాలం గర్వించదగ్గ కళాకారుడు కమల్ హాసన్. సినీ రంగంలో అనేక ప్రయోగాలతో రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఇటీవల 70వ వసంతంలోకి అడుగు పెట్టిన కమల్ హాసన్.. ఓ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని పాటించాలని తన అభిమానులను కోరుతూ ఎక్స్ వేదికగా ఓ విన్నపం చేశారు. కమల్ హాసన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

కమల్ హాసన్ తీసుకున్న ఆ కీలక నిర్ణయం ఏంటంటే.. ఇకపై తనను ఎలాంటి స్టార్ ట్యాగ్స్‌తో పిలవొద్దని.. కేవలం కమల్ లేదా కమల్ హాసన్ అని పిలవాలని తెలిపారు. సినీ ప్రియులకు మరెన్నో అద్బుతమైన చిత్రాలు అందించాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దీనిని తప్పుగా అర్ధం చేసుకోవద్దని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. కమల్ హాసన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఓ నటుడిగా కళ కంటే దేన్ని ఎక్కువగా చూడకూడదన్నది తన విన్నపమన్నారు. తాను ఎప్పుడూ వినయంగానే ఉండాలని అనుకుంటున్నానని.. తనను తాను ఎప్పుడూ మెరుగుపరుచుకోవాలనే భావిస్తానని అన్నారు. అందుకే అన్ని బిరుదులను ఎంతో మర్యాదపూర్వకంగా తిరస్కరిస్తున్నానని కమల్ స్పష్టం చేశారు. అన్నట్లు కమల్ హాసన్‌ని ఆయన అభిమానులు ఉలగనాయకన్ అనే బిరుదుతో పిలుచుకుంటారనే విషయం తెలిసిందే.

గతంలో నటుడు అజిత్ కుమార్ కూడా ఇలాంటి విన్నపమే చేశాడు. తన పేరుకు ముందు తలా అని కానీ, మరే స్టార్ ట్యాగ్ తగిలించవద్దని కోరాడు. అజిత్, అజిత్ కుమార్ లేదంటే ఏకే అని మాత్రమే సంభోదించాలని విజ్ఞప్తి చేశారు.

ఇక ఈ మధ్యే కల్కి 2898 ఏడీ మూవీలో కనిపించిన కమల్ హాసన్.. ఇప్పుడు మణిరత్నం డైరెక్షన్‌లో థగ్ లైఫ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జూన్ 5న రిలీజ్ చేయనున్నట్టు ఈ మధ్యే మేకర్స్ వెల్లడించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories