Kalki 2898 AD Sequel: కల్కి సీక్వెల్‌పై స్పందించిన నాగ అశ్విన్‌.. ఆసక్తికర విషయాలు పంచుకున్న దర్శకుడు..!

Director Nag Ashwin Reveals Interesting Update on Kalki Part 2
x

Kalki 2898 AD Sequel: కల్కి సీక్వెల్‌పై స్పందించిన నాగ అశ్విన్‌.. ఆసక్తికర విషయాలు పంచుకున్న దర్శకుడు..!

Highlights

Kalki 2898 AD Sequel: ప్రభాస్‌ హీరోగా నాగ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన కల్కి చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Kalki 2898 AD Sequel: ప్రభాస్‌ హీరోగా నాగ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన కల్కి చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన ప్రతీ చోట పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఓవర్‌సీస్‌ మార్కెట్‌తో పాటు ఇండియాలో భారీ వసూళ్లను రాబడుతోందీ చిత్రం.

ఇప్పటికే రూ. 700 కోట్లకు పైగా వసూళ్లును రాబట్టిన ఈ సినిమా రూ. వెయ్యి కోట్ల దిశగా దూసుకెళ్తోంది. ఈ వారాంతం కూడా పెద్ద సినిమాలేవి విడుదలకు సిద్ధంగా లేకపోవడంతో కల్కి రూ. వెయ్యి కోట్ల మార్క్‌ను దాటడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే కల్కి చిత్రానికి పార్ట్‌ 2 తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే నిర్మాత సీక్వెల్‌కు సంబంధించి ప్రకటన చేశారు. కల్కి సీక్వెల్‌ షూటింగ్ మొదలైందని అశ్వనీ దత్‌ తెలిపారు.

ఇదిలా ఉంటే తాజాగా కల్కి సీక్వెల్‌పై దర్శకుడు నాగ అశ్విన్‌ తొలిసారి స్పందించారు. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. కల్కి సినిమా అసలు కథ మొదలయ్యేది పార్ట్‌ 2లోనే అని హింట్‌ ఇచ్చారు. కల్కి పార్ట్‌2కి సంబంధించి ఇప్పటికే నెల రోజు షూటింగ్ చేశామన్న నాగ అశ్విన్‌ దాంట్లో 20 శాతం చాలా బాగా వచ్చిందన్నారు.

ఇంకొన్ని ముఖ్యమైన యాక్షన్‌ సీన్స్‌ను తెరకెక్కించాల్సి ఉందన్నారు. కల్కి సీక్వెల్‌లో కమల్‌ హాసన్‌, ప్రభాస్‌, అమితాబ్‌ల మధ్య భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయని తెలిపిన నాగ అశ్విన్‌.. అశ్వత్థామ, కర్ణుడు, యాస్కిన్‌ల మధ్య శక్తిమంతమైన ధనుస్సు కీలకం కానుందని ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. దీంతో కల్కి సీక్వెల్‌పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.

కాగా కల్కికి ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణపై కూడా నాగ అశ్విన్‌ స్పందించారు. ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్‌ చేస్తున్నారన్న ఆయన.. ఎంతోమంది ఆడియన్స్‌ ఒకసారి కంటే ఎక్కువసార్లు దీన్ని వీక్షిస్తున్నారు. సినిమా విజయం సాధించిందని చెప్పడానికి అదే సంకేతమన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories