Kalki 2898 AD: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో కల్కి.. ఏడో భారతీయ చిత్రంగా.. !

Kalki 2898 AD Movie Crossed RS 900 Crores in 11 Days, Check Here for Full Details
x

Kalki 2898 AD: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో కల్కి.. ఏడో భారతీయ చిత్రంగా.. !

Highlights

Kalki 2898 AD: ప్రభాస్‌ హీరోగా నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కి కల్కి చిత్రం రికార్డులను తిరగరాస్తోంది.

Kalki 2898 AD: ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి చిత్రం రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన తొలి షో నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామిని సృష్టిస్తోంది. కనివినీ ఎరగని రీతిలో కల్కి వసూళ్ల సునామిని సృష్టిస్తోంది. నాగ్ అశ్విన్‌ ఊహ శక్తికి, మహా భారతాన్ని, భవిష్యత్తును మిక్స్‌ చేసిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

దీంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉందీ చిత్రం. ఇప్పటి వరకు కల్కి సినిమా విడుదలైన 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్లకుపైగా గ్రాస్‌ను రాబట్టిందని చిత్ర యూనిట్‌‌ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ సినిమా రూ. వెయ్యి కోట్ల మార్క్‌ను చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వారాంతం భారతీయుడు2 ఒక్క సినిమానే పెద్ద సినిమా థియేటర్లలకు వస్తున్న నేపథ్యంలో కల్కి రూ. వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరడం లాంఛనమే.

ఇదిలా ఉంటే కల్కి మూవీ బాలీవుడ్‌లో కూడా కలెక్షన్ల సునామిని కురిపిస్తోంది. ఇప్పటి వరకు బాలీవుడ్‌లో ఈ సినిమా రూ. 200 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. అమితాబ్‌ అద్బుత నటన, దీపికా పదుకొణె కూడా ఉండడంతో నార్త్‌లోనూ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభాస్‌ సినిమాల పరంగా చూస్తే బాలీవుడ్‌లో ఇది రెండో అత్యధిక గ్రాస్‌ వసూళ్లు సాధించిన చిత్రం. ఇదిలా ఉంటే కల్కి రూ. వెయ్యి కోట్ల మార్క్‌ను చేరుకుంటే ఈ ఘనత సాధించిన ఏడో భారతీయ చిత్రంగా నిలవనుంది.

కాగా ఓవర్‌సీస్‌లో కూడా కల్కి రికార్డులను తిరగరాస్తోంది. నార్త్‌ అమెరికాలో ఇప్పటి వరకూ ఏ దక్షిణాది సినిమా సాధించని అరుదైన ఘనతను సాధించింది. ఇప్పటి వరకు ఈ సినిమా 16 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు ట్రేడింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. బుక్‌ మై షోలో కోటికి పైగా టికెట్లు అమ్ముడుపోయిన చిత్రంగా కల్కి సరికొత్త రికార్డును నెలకొల్పింది.



Show Full Article
Print Article
Next Story
More Stories