త్వరలోనే కాజల్ పెళ్లి.. వరుడే ఇతడేనా?

త్వరలోనే కాజల్ పెళ్లి.. వరుడే ఇతడేనా?
x
Highlights

Kajal Aggarwal Marriage : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ హీరోయిన్ లలో కాజల్ అగర్వాల్ ఒకరు.. గత కొన్ని రోజులుగా కాజల్ పెళ్లి అంటూ సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతుంది. అంతేకాకుండా ఇప్పటికే కాజల్ కి నిశ్చితార్థం కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి.

Kajal Aggarwal Marriage : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ హీరోయిన్ లలో కాజల్ అగర్వాల్ ఒకరు.. గత కొన్ని రోజులుగా కాజల్ పెళ్లి అంటూ సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతుంది. అంతేకాకుండా ఇప్పటికే కాజల్ కి నిశ్చితార్థం కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి.. అయితే కాజల్ కి కాబోయే భర్త ఇతనే అంటూ మరో న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ముంబైకి చెందిన బిజినెస్ మెన్ గౌతమ్‌ కిచ్లుతో త్వరలో కాజల్ పెళ్లి జరగనున్నట్లుగా సమాచారం.. ఇక గతంలోనూ కాజల్ పెళ్లికి సంబంధించి అనేక వార్తలు రాగా.. అప్పట్లో ఈ చందమామ హీరోయిన్ వాటిని కొట్టిపారేసింది. తాజా ప్రచారంపై ఈ బ్యూటీ స్పందించకపోవడంతో నిజమేనని అంతా భావిస్తున్నారు.

ఇక గౌతమ్‌ ముంబైకి చెందిన వ్యాపారవేత్త కాగా, కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్‌లో చదువుకున్నట్లుగా సమాచారం.. ప్రస్తుతం డిసెర్న్ లివింగ్ అనే ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థను స్థాపించి నడుపుతున్నారని తెలుస్తోంది. ఇక వీరి వివాహం ముంబయిలోని ఓ హోటల్‌లో జరగనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వేడుకకి అత్యంత సన్నిహుతులు మాత్రమే హాజరుకానున్నారని సమాచారం.. ఇక గౌతమ్‌ కిచ్లు సోషల్ మీడియాలోని ఫోటోలకు కాజల్ లైక్స్ కొట్టడం, కామెంట్ చేయడంతో ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. దీనిపైన ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది..

అటు కాజల్ అగర్వాల్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం కమల్‌ హాసన్‌,శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కతున్న 'భారతీయుడు 2'లో హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా దుల్కర్‌ సల్మాన్‌, అదితిరావు హైదరి జంటగా నటిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక తెలుగులో చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో వస్తున్న 'ఆచార్య' మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది కాజల్.. ఈ సినిమాలు కరోనా వలన వాయిదా పడ్డాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories