Devara: కోవిడ్‌ తర్వాత ఆ ఘనత సాధించిన చిత్రంగా 'దేవర'.. ఏంటంటే..

Devara
x

Devara

Highlights

Devara: ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'దేవర' ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Devara: ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'దేవర' ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ట్రిపులార్‌ లాంటి భారీ విజయం తర్వాత ఎన్టీఆర్‌ మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పటికే పలు రికార్డులను తిరగరాసిందీ మూవీ. విడుదలైన అన్ని చోట్ల భారీ కలెక్షన్లను రాబట్టిందీ మూవీ.

విడుదలకు ముందే ప్రీ బిజినెస్‌తోనే రికార్డులు మొదలు పెట్టిన దేవర.. విడుదల తర్వాత రికార్డులను తిరగరాసింది. దేవర ఇప్పటి వరకు ఏకంగా రూ. 510 కోట్ల గ్రాస్‌ను రాబట్టి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా దేవర కలెక్షన్లు ఇంకా కొనసాగుతుండడం విశేషం. తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుందీ మూవీ. ‘దేవర’ రిలీజై 18 రోజులు పూర్తవగా.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లో రోజూ కోటి రూపాయలు వసూలుచేసినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. కోవిడ్‌ తర్వాత ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టిన సినిమా ‘దేవర’ కావడం విశేషం.

ఇక సీడెడ్‌ ఏరియా కలెక్షన్ల విషయంలో కూడా దేవర అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఏకంగా ఈ సినిమా సీడెడ్‌లో రూ. 30 కోట్ల షేర్‌ వసూలు చేయడం విశేషం. సీడెడ్‌లో రాజమౌళి తర్వాత ఈ రేంజ్‌లో కలెక్షన్లు రాబట్టిన సినిమాగా దేవర నిలిచింది. సీడెడ్‌ ఏరియాలో రూ.30 కోట్లు దాటిన రెండు సినిమాలు ఉన్న ఏకైక హీరోగా ఎన్టీఆర్‌ నిలిచారు.

ఇదిలా ఉంటే దేవర చిత్రానికి సీక్వెల్‌ కూడా రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సెకండ్ పార్ట్‌కు సంబంధించి కొంతమేర షూటింగ్ కూడా జరుపుకుంది. పార్ట్‌1తో పోల్చితే పార్ట్‌2 మరింత బాగుంటుందని ఇప్పటికే దర్శకుడు కొరటాల తెలిపారు. దీంతో దేవర సీక్వెల్‌పై అంచనాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్‌ నట విశ్వరూపం సీక్వెల్‌లో చూడనున్నారని కొరటాల చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories