Devara Movie Trailer Review: అంచనాలను అమాంతం పెంచేసిన దేవర ట్రైలర్‌.. గూస్‌బంప్స్‌ రావడం ఖాయం..!

Devara Movie Trailer Review
x

Devara Movie Trailer Review

Highlights

Devara Trailer Review: ఎన్టీఆర్‌ (NTR) హీరోగా తెరకెక్కుతోన్న దేవర (Devara) మూవీ కోసం జూనియర్‌ అభిమానులే కాకుండా యావత్‌ ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది.

Devara Trailer Review: ఎన్టీఆర్‌ (NTR) హీరోగా తెరకెక్కుతోన్న దేవర (Devara) మూవీ కోసం జూనియర్‌ అభిమానులే కాకుండా యావత్‌ ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమా సెప్టెంబర్‌ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. విడుదల తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ప్రమోషన్స్‌ కూడా అదే స్థాయిలో ఉన్నాయి.

ఈ సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌ రోల్‌లో నటిస్తుండంతో బాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో అక్కడ కూడా ప్రమోషన్స్‌ జోరందుకుంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. 2.39 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. సినిమాపై ఈ ట్రైలర్‌ అంచనాలను ఒక్కసారిగా ఆకాశాన్ని అంటేలా చేసింది. కొరటాల మరోసారి కరెక్ట్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ఇక ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికగా సాగింది. ఇందులో ఎన్టీఆర్‌ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక అనిరుధ్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ట్రైలర్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. సముద్ర తీర ప్రాంతంలో సమాజంతో సంబంధం లేకుండా జీవిస్తున్న ఓ తెగ మధ్య జరిగిన ఆధిపత్య పోరు ఇతివృత్తంగా ఈ సినిమా ఉండనున్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ చిత్రాన్ని కొరటాల రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తొలి పార్ట్‌ను ఈనెల 27న రిలీజ్ చేయనున్నారు.

ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాపై హైప్‌ తీసుకురాగా.. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా జాన్వీ నటిస్తుండగా. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories