Devara: ఫ్యాన్స్ షోలో అపశ్రుతి.. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మృతి

Devara: ఫ్యాన్స్ షోలో అపశ్రుతి.. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మృతి
x

Devara: ఫ్యాన్స్ షోలో అపశ్రుతి.. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మృతి

Highlights

Devara: కడప జిల్లాలో దేవర సినిమా ఫ్యాన్స్ షో ముందు అపశృతి చోటుచేసుకంది. రాజా థియేటర్‌లో జరిగిన ఘర్షణ అనంతరం జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మస్తాన్ మృతి చెందారు.

Devara: కడప జిల్లాలో దేవర సినిమా ప్రదర్శన సమయంలో విషాదం చోటు చేసుకుంది. రాజా థియేటర్ లో జరిగిన ఘర్షణలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మస్తాన్ మృతి చెందారు. అభిమానుల కోసం ఈ థియేటర్ ప్రత్యేక షో వేశారు. దీంతో పెద్ద సంఖ్యలో అభిమానులు థియేటర్ వద్దకు వచ్చారు.

అయితే వారిని కట్టడి చేసేందుకు థియేటర్ యాజమాన్యం ప్రయత్నించింది. ఈ క్రమంలో థియేటర్ యాజమాన్యంపై ఎన్టీఆర్ అభిమానులు దాడికి దిగారు. ఈ ఘర్షణలో ఎన్టీఆర్ అభిమాని మస్తాన్ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకొని పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. థియేటర్ నుంచి ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే మస్తాన్ చనిపోయారు. ఆయన స్వగ్రామం చింతకొమ్మదిన్నె మండలం జమాల్ పల్లి గ్రామం.

Also Read: Devara Review: థియేటర్లలో మాస్‌ జాతర.. దేవర మూవీ రివ్యూ ఎలా ఉందంటే..?

Also Read: Devara Public Talk: దేవర ఎలా ఉంది.? అసలు పబ్లిక్‌ ఏమంటున్నారంటే..?

Show Full Article
Print Article
Next Story
More Stories