Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ట్రిపులార్ తర్వాత ఎన్టీఆర నటిస్తోన్న సినిమా కావడంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ట్రిపులార్ తర్వాత ఎన్టీఆర నటిస్తోన్న సినిమా కావడంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అదే విధంగా జనతా గ్యారేజీ తర్వాత కొరటాల-ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో అంచనాలకు అనుగుణంగానే కొరటాల శివ ఈ సినిమాను భారీగా తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘దేవర’ స్పెషల్ షోలతో పాటు, టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కథానాయకుడు ఎన్టీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
“దేవర రిలీజ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసినందుకు, తెలుగు సినిమాకు మద్దతు కొనసాగిస్తున్నందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌కు కూడా థ్యాంక్స్ చెబుతున్నా” అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
My heartfelt gratitude to the Honourable CM, Sri @NCBN garu, and Honourable Deputy CM, Sri @PawanKalyan garu of the Andhra Pradesh government for passing the new G.O. for the #Devara release and for your continued support of Telugu cinema. I'm also thankful to Cinematography…
— Jr NTR (@tarak9999) September 21, 2024
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire