Jr. NTR Childhood Dance Video Viral: వైరల్ అవుతున్న ఎన్టీఆర్ భరతనాట్యం వీడియో!

Jr. NTR Childhood Dance Video Viral: వైరల్ అవుతున్న ఎన్టీఆర్ భరతనాట్యం వీడియో!
x
Highlights

Jr. NTR Childwood Dance Video Viral: యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఎంత టాలెంటెడ్ యాక్టర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Jr. NTR Childwood Dance Video Viral: యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఎంత టాలెంటెడ్ యాక్టర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం నటన మాత్రమే కాదు డాన్స్ లో కూడా ఎన్టీఆర్ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి తర్వాత ప్రేక్ష‌కుల‌ని త‌న డ్యాన్స్‌తో మెప్పించిన స్టార్ ఎన్టీఆర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.. అయితే ఎన్టీఆర్ కి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అది ఏంటంటే ?

ఎన్టీఆర్ చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకున్న సంగతి తెలిసిందే.. చిన్నవయసు నుండే ఎన్టీఆర్ కి డాన్స్ మీద అమితమైన ఆసక్తిితో ఉండడంతో ఎన్టీఆర్ అమ్మ శాలిని ప్రోత్సాహంతో నృత్యకళలో శిక్షణ తీసుకున్నాడట.. డాన్స్ నేర్చుకుంటూ స్టేజి షోలలో ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. ఆ సమయంలోనే ఎన్నో బహుమతులు కూడా అందుకున్నాడట. అందులో భాగంగానే టీనేజ్ లో ఉన్నపుడు ఎన్టీఆర్ చేసిన భరతనాట్యం పర్ఫార్మెన్స్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ వీడియోని ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో మరింతగా షేర్ చేస్తున్నారు..

ఇక ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అది సినిమాతో స్టార్ అయ్యాడు. ఇక టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సింహాద్రి సినిమాతో మరింత స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడు.ఇందులో ఎన్టీఆర్ తో పాటుగా చరణ్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు.

పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటిచింది.


Show Full Article
Print Article
Next Story
More Stories