Tarak Ratna: నివాళర్పించిన హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

Jr NTR And Kalyan Ram Were The Heroes Paid Their Respects
x

Tarak Ratna: నివాళర్పించిన హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

Highlights

Tarak Ratna: తారకరత్న పార్థివదేహానికి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి

Tarak Ratna: తారకరత్న భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. తారకరత్న భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. సతీమణి భువనేశ్వరితో కలిసి మోకిలలోని తారకరత్న నివాసానికి చేరుకుని అంజలి ఘటించారు. అనంతరం తారకరత్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. నందమూరి తారకరత్న భౌతికకాయానికి ఎంపీ విజయసాయి రెడ్డి నివాళులు అర్పించారు. ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరమని అన్నారు.

సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, నటుడు విజయ్, శివాజీరాజా.. తారక్ మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌తో కొద్దిసేపు మాట్లాడారు. తారక్ సతీమణి, కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. నటుడు మురళీమోహన్ తారకరత్న పార్థివదేహానికి నివాళులర్పించారు.

23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తారకరత్న అకాల మరణంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాదకర వాతావరణం నెలకొంది. ఆయన మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు తారకరత్న పార్థివ దేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం జూబ్లీహిల్స్‌లోని ఫిలిం ఛాంబర్స్‌లో ఉంచనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories