ట్రైలర్‌పై ఘాటుగా స్పందించిన జీవిత

ట్రైలర్‌పై ఘాటుగా స్పందించిన జీవిత
x
Highlights

త్వరలో ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా 'డిగ్రీ కాలేజ్' అనే సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కి ముఖ్య అతిధి గా వచ్చిన జీవిత సినిమాపై కొన్ని...

త్వరలో ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా 'డిగ్రీ కాలేజ్' అనే సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కి ముఖ్య అతిధి గా వచ్చిన జీవిత సినిమాపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. "ట్రైలర్ చూశాక మీరు నా లాంటి రాంగ్ పర్సన్ ను పిలిచారు అనిపించింది. నేను సెంట్రల్ సెన్సార్ బోర్డ్ మెంబర్ ని అని మర్చిపోయినట్టున్నారు. మీ సినిమా ఇంకా సెన్సార్ కాలేదనుకుంటున్నాను. 'అర్జున్ రెడ్డి', 'RX 100' లాంటి సినిమాల పుణ్యమా అని లిప్ లాక్ లేకుండా తెలుగు సినిమా లేదు అనే స్థితికి దిగజారిపోయిందనిపిస్తోంది. మీ సినిమా కార్యక్రమానికి వచ్చి నేను ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. కానీ ఏదైనా దాచి ఉన్నంతవరకే అందం." అని క్లాస్ పీకారు జీవిత.

"బట్టలిప్పుకోవడం, అమ్మాయిలు అబ్బాయిల మీద ఎక్కి కూర్చోవడం, ఇలాంటి సీన్లపై వేలెత్తి చూపిస్తే మీ జీవితంలో లేదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది కానీ మనం రోడ్డు మీద అలాంటి పనులు చేయం కదా? ప్రతి ఒక్కరూ ఒక విషయం అర్థం చేసుకోవాలి. సోషల్ మీడియాలో, టీవీల్లో ఇలాంటివి ఉండటం ఉన్నా వాటిని మనం ఒక రూములో, ఒక్కరం కూర్చుని చూస్తాం కానీ సినిమా అంటే కొన్ని వందల మందితో కలిసి చూసేది. వారి మధ్యలో మనం శృంగారం చేయం. అసభ్యంగా ప్రవర్తించం. మనకీ కుటుంబాలు ఉన్నాయి, ఇళ్ళలో పిల్లలు ఉన్నారనేది గుర్తుంచుకోవాలి కదా." అని ఘాటుగా మాట్లాడారు జీవిత.

"మీ సినిమాను నేను తప్పుబడట్టం లేదు. నిర్మాతలు రోడ్డు మీదకు వచ్చేస్తారనే ఆలోచనతో కొన్ని సినిమాలకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇది కాంట్రవర్సీ కోసం చెప్పలేదు. నేను నా మనసులో ఉన్నది చెప్పాను. ఆ సీన్ల సంగతి పక్కన పెడితే మీ మేకింగ్ చాలా బావుంది, ప్రొడక్షన్ వ్యాల్యూస్ బావున్నాయి. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, ఈ సినిమా మిమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాను" అని స్పీచ్ ని ముగించారు జీవిత.

Show Full Article
Print Article
Next Story
More Stories