Jayam Ravi Divorce News: విడాకులు తీసుకున్న మరో స్టార్ హీరో.. ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దని ట్వీట్

Jayam Ravi Divorce News: విడాకులు తీసుకున్న మరో స్టార్ హీరో.. ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దని ట్వీట్
x
Highlights

Jayam Ravi Divorce News: తమిళ స్టార్ హీరో జయం రవి, అతడి భార్య ఆర్తి రవి విడిపోయారు. తాము డైవర్స్ తీసుకున్నట్లుగా జయం రవి స్వయంగా ఎక్స్ వేదికగా...

Jayam Ravi Divorce News: తమిళ స్టార్ హీరో జయం రవి, అతడి భార్య ఆర్తి రవి విడిపోయారు. తాము డైవర్స్ తీసుకున్నట్లుగా జయం రవి స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటించాడు. 2009 లో జయం రవికి, ఆర్తికి పెళ్లయింది. 15 ఏళ్ల కాపురానికి గుర్తుగా వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. 15 ఏళ్ల వైవాహిక జీవితం తరువాత వ్యక్తిగత కారణాలతో తాము ఇద్దరం విడిపోతున్నట్లుగా జయం రవి స్పష్టంచేశాడు. ఇది మా ఇద్దరికి జీవితానికి ముడిపడిన విషయం. ఇది తొందరపాటు నిర్ణయం కానే కాదు.. ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ఇలాంటి సమయంలో జయం రవి విడాకులు అంటూ తమ విడాకుల గురించి ఏవేవో ఊహించుకుని, ఏవేవో కామెంట్స్ చేసి తమని, తమ కుటుంబాన్ని ఇబ్బందిపెట్టవద్దని కోరుకుంటున్నాను అంటూ జయం రవి ఒక పెద్ద సందేశాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన అభిమానులకు ఈ సందర్భంగా జయం రవి థాంక్స్ చెప్పుకున్నాడు.

జయం రవి డైవర్స్ గాసిప్స్ నిజమయ్యాయి

జయం రవి డైవర్స్ గురించి జూన్ నెలలోనే తొలిసారిగా వార్తలు గుప్పుమన్నాయి. జూన్ 4న జయం రవి, ఆర్తి రవి తమ 15వ వెడ్డింగ్ యానివర్సరీ వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ తరువాతే ఆర్తి రవి తన ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ నుండి తన భర్త జయం రవితో కలిసి తీసుకున్న ఫోటోలను డిలీట్ చేశారు. అప్పుడే జయం రవి డైవర్స్ న్యూస్ తొలిసారిగా బయటికొచ్చింది. జయం రవికి, ఆర్తి రవికి మధ్య దూరం పెరిగిందని.. ఇద్దరి మధ్య విభేదాలు డైవర్స్ వరకు పోయాయని తమిళ మీడియాలో రకరకాల కథనాలొచ్చాయి. అందుకే ఆర్తి రవి తన సోషల్ మీడియా ఖాతాలో భర్త జయం రవి ఫోటోలను డిలీట్ చేశారు అని ఆ గాసిప్స్‌ కథనాలు పేర్కొన్నాయి.

డైవర్స్ గాసిప్స్ గుప్పుమన్న తరువాత జయం రవి తొలిసారిగా హీరోగా వచ్చిన 2003 నాటి జయం మూవీ గురించి ఆర్తి రవి సోషల్ మీడియా ద్వారా గుర్తుచేసుకున్నారు. దాంతో ఆ డైవర్స్ కథనాలకు బ్రేక్ పడింది. కానీ తాజాగా జయం రవి తనే స్వయంగా చేసిన ప్రకటనతో ఆనాటి డైవర్స్ గాసిప్సే నిజమయ్యాయి కదా అని కోలీవుడ్ ఇండస్ట్రీవర్గాలు చెప్పుకుంటున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories