జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మృతికి ప్ర‌ముఖుల నివాళి

జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మృతికి ప్ర‌ముఖుల నివాళి
x
Highlights

సీనియర్ సినీనటుడు జయప్రకాష్ రెడ్డి ఈ తెల్లవావారుజామున మృతి చెందారు. లాక్ డౌన్ పెట్టినప్పటి నుంచి గుంటూరులోనే ఉంటున్న అయన ఈ తెల్లవారుజామున...

సీనియర్ సినీనటుడు జయప్రకాష్ రెడ్డి ఈ తెల్లవావారుజామున మృతి చెందారు. లాక్ డౌన్ పెట్టినప్పటి నుంచి గుంటూరులోనే ఉంటున్న అయన ఈ తెల్లవారుజామున గుండెపోటు తో బాత్ రూమ్ లోనే కుప్పకూలి మరణించారు. విలన్ గా, కామెడీ ఆర్టిస్ట్ గా జయప్రకాశ్ రెడ్డి తెలుగు సినిమా ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. ఫాక్షన్ సినిమాలలో ఆయన విలన్ గా ప్రత్యేక నటన కనబరిచేవాడు. అనేక హిట్ సినిమాల్లో ఫ్యాక్షన్ సినిమాల్లో మెయిన్ విలన్గా ఆకట్టుకున్నారు. జయప్రకాష్ మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మృతికి టాలీవుడ్ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు సంతాపం తెలియ‌జేశారు. చంద్ర‌బాబు నాయుడు త‌న ట్విట్ట‌ర్ ద్వారా.. జయప్రకాష్ రెడ్డి గారు మరణంతో తెలుగు సినిమా, థియేటర్ మూగ‌బోయింది. ఆయ‌న చేసిన బహుముఖ ప్ర‌ద‌ర్శ‌న‌లు, మ‌ర‌పురాని సినిమాలతో ఎన్నో ద‌శాబ్దాలుగా అల‌రించారు. ఆయ‌న మృతికి సంతాపం తెలియ‌జేస్తున్నాను. కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలియ‌జేస్తున్న‌ట్టు పేర్కొన్నారు.

ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్‌రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జయప్రకాశ్‌రెడ్డి మరణం పరిశ్రమకు తీరని లోటు అన్నారు.

జయప్రకాశ్‌రెడ్డి మరణం పట్ల సినిమా ప్రముఖులు సంతాపం తెలిపారు. సినిమా పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయిందని నివాళులు అర్పిస్తున్నారు. ఇక తెలుగు సినీ ప‌రిశ్ర‌కు సంబంధించి ఎన్టీఆర్‌, అనీల్ రావిపూడి, సుధీర్ బాబు, గోపిచంద్ మ‌లినేని త‌దిత‌రులు ఆయ‌న మృతికి నివాళులు అర్పించారు.











Show Full Article
Print Article
Next Story
More Stories