Jani Master: రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్ ను విచారిస్తున్న పోలీసులు

Jani Master: రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్ ను విచారిస్తున్న పోలీసులు
x
Highlights

Jani Master: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌.. నార్సింగి పోలీసుల అదుపులో ఉన్నారు.

Jani Master: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌.. నార్సింగి పోలీసుల అదుపులో ఉన్నారు. రహస్య ప్రదేశంలో జానీని పోలీసులు విచారిస్తున్నారు. నగర శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో పోలీసుల విచారణ కొనసాగుతోంది. తనను లైంగికంగా వేధించారని మహిళా అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ ఫిర్యాదుతో జానీపై పోక్సో కేసు నమోదైంది.

ఇవాళ పోక్సో కోర్టు ఎదుట జానీ మాస్టర్‌ను హాజరుపర్చనున్నారు పోలీసులు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరుస్తారు. అయితే జానీ మాస్టర్‌ను వారంరోజుల పాటు పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న గోవాలో కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ను అరెస్ట్‌ చేసి గోవా నుంచి హైదరాబాద్‌కు తరలించారు పోలీసులు.


Show Full Article
Print Article
Next Story
More Stories