జేమ్స్ బాండ్ నటుడు సీన్ కానరీ కన్నుమూత

జేమ్స్ బాండ్ నటుడు సీన్ కానరీ కన్నుమూత
x
Highlights

హాలీవుడ్ తొలి జేమ్స్ బాండ్ నటుడు సీన్ కానరీ కన్నుమూశారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు. అనారోగ్య కారణాలతో సీన్ కానరీ తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

హాలీవుడ్ తొలి జేమ్స్ బాండ్ నటుడు సీన్ కానరీ కన్నుమూశారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు. అనారోగ్య కారణాలతో సీన్ కానరీ తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. స్కాటిష్‌లో జన్మించిన సీన్ కానరీకి... ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. జేమ్స్ బాండ్‌ సిరీస్‌లో వచ్చిన తొలి సినిమాతో సహా ఏడు సినిమాల్లో నటించి జేమ్స్ బాండ్ స్టార్‌గా నిలిచిపోయారు. 40 ఏళ్లకు పైగా ఆడియెన్స్‌ ఆదరాభిమానాలు చూరగొంటూ వచ్చారు.

ది విండ్ అండ్ ది లైన్, ది మేన్ హు వుడ్ బి కింగ్, ఇండియానా జోన్స్ అండ్ ది లాస్ట్ క్రూసేడ్, ది హంట్ ఫర్ రెడ్ అక్టోబర్ వంటి చిత్రాలు ఆయనకు మంచిపేరు తెచ్చాయి. ది అన్ టచబుల్స్ సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయనటుడుగా ఆస్కార్ గెలుచుకున్నారు. వయసు పెరిగినా సీన్ కానరీ స్టార్ పవర్ చెక్కుచెదర లేదు. ఆయన డిమాండ్ తగ్గకపోవడమే కాకుండా మంచి రెమ్యూనరేషన్ అందుకున్నారు.

సీన్ కానరీ 1999లో పీపుల్స్ మ్యాగజైన్ సెక్సియస్ట్ మేన్ ఆఫ్ ది సెంచరీగా ఎంపికయ్యారు. సీన్ కానరీ తన 17వ ఏట రాయల్ నేవీలో చేరారు. అయితే తీవ్రమైన అల్సర్స్ కారణంగా మూడేళ్ల తర్వాత ఆయన నేవీ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తిరిగి ఎడిన్‌బర్క్‌ వచ్చి తనకు ఇష్టమైన వృత్తుల్లో పనిచేశారు. బాడీబిల్డింగ్ నేర్చుకుని 1950లో మిస్టర్ యూనివర్స్ పోటీలో మూడో స్థానం గెలుచుకున్నారు. 2008లో కానరీ తన ఆటోబయోగ్రఫీ బీయింగ్ ఎ స్కాట్ ప్రచురించారు. ప్రతిష్ఠాత్మక నైట్ హుడ్, అకాడమీ అవార్డులు అందుకున్నారు. 2006లో అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి లైఫ్ ఎచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు

Show Full Article
Print Article
Next Story
More Stories