Jabardasth Comedian: ప్రేమపేరుతో మోసం.. జబర్దస్త్‌ కమెడియన్‌ అరెస్ట్‌..!

Jabardasth Comedian Nava Sandeep Arrested
x

Jabardasth Comedian: ప్రేమపేరుతో మోసం.. జబర్దస్త్‌ కమెడియన్‌ అరెస్ట్‌..!

Highlights

Jabardasth Comedian: యువతిని ప్రేమ పేరుతో మభ్యపెట్టి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన జబర్దస్త్‌ నటుడు నవసందీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Jabardasth Comedian: యువతిని ప్రేమ పేరుతో మభ్యపెట్టి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన జబర్దస్త్‌ నటుడు నవసందీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నవసందీప్ 2018 నుంచి ఓ యువతితో ప్రేమాయణం నడుపుతున్నాడు. ఇద్దరికీ వాట్సాప్ చాటింగ్ ద్వారా పరిచయం అయినట్లు తెలుస్తోంది. వీరిద్దరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో ఆమెను హైదరాబాద్‌కు రప్పించాడు. నాలుగేళ్లుగా ఆమె షేక్‌పేటలోని ఓ హాస్టల్‌లో ఉంటోంది.

అతని మాటలు నమ్మిన యువతి శారీరకంగా దగ్గరైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మ బలికి కోరిక తీర్చుకున్నాడు. తర్వాత ఆమె పెళ్లి ప్రస్తావన తేగానే ముఖం చాటేశాడు. తాను వేరొకరిని పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు నవసందీప్‌ను అరెస్ట్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories