డైరెక్టర్లు సోషల్ మీడియాకి అందుకే దూరం అవుతున్నారా?

Is This Why Directors Are Avoiding Social Media
x

డైరెక్టర్లు సోషల్ మీడియాకి అందుకే దూరం అవుతున్నారా? 

Highlights

* అందుకే ట్విట్టర్ కి బై చెబుతున్న సెలబ్రిటీలు..

Prashanth Neel: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు అందరూ ఒకరి తర్వాత ఒకరు సోషల్ మీడియా కి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఏదో ఒక కారణంతో ట్విట్టర్ మరియు ఇంస్టాగ్రామ్ హ్యాండిల్స్ ను డిలీట్ చేసేస్తున్నారు. "ఆచార్య" సినిమా డిజాస్టర్ అయిన తర్వాత ట్రోల్స్ ని భరించలేక డైరెక్టర్ కొరటాల శివ కూడా ట్విట్టర్ కు వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయారు. తాజాగా ఇప్పుడు మరొక స్టార్ డైరెక్టర్ ఈ జాబితాలో చేరారు.

ఆయనే ప్రశాంత్ నీల్. కన్నడలో "కేజిఎఫ్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. "కేజిఎఫ్ 2" సినిమాతో ప్రశాంత్ పేరు వరల్డ్ వైడ్ గా మారుమ్రోగింది. ప్రస్తుతం ప్రశాంత్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "సలార్" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా కొద్ది రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే తన ట్విట్టర్ అకౌంట్ ని క్లోజ్ చేశారు. ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు ముఖ్యంగా డైరెక్టర్లు సోషల్ మీడియా వదిలి వెళ్ళిపోవడానికి గల కారణం అభిమానులు అని తెలుస్తోంది.

సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా లేక సినిమా గురించి అప్డేట్ కోసమైనా కూడా ఫాన్స్ ముందుగా టార్గెట్ చేసేది డైరెక్టర్స్ నే. సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఎప్పటికప్పుడు డైరెక్టర్లను సినిమా గురించి అప్డేట్లు అడుగుతూ ప్రెషర్ చేస్తూ ఉంటారు. ఆఖరికి సినిమా ఎలా ఉండాలో కూడా వాళ్లే చెప్పేస్తూ ఉంటారు. ఇవన్నీ డైరెక్టర్ పై మరింత ప్రెషర్ ను పెంచుతూ ఉంటాయి. మాస్ ట్యాగింగ్ మరియు ఆబ్లిగేషన్స్ వాళ్లని డైరెక్టర్లు సోషల్ మీడియా నుంచి వెళ్లిపోతున్నారని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories